
తొమ్మిదో గ్రహం లేదు!
వాషింగ్టన్: మన సౌర కుటుంబం లో ఫ్లూటోకు ఆవల సూర్యుడి చుట్టూ తిరుగు తోందని శాస్త్రవేత్తలు చెప్పిన ‘ప్లానెట్ 9’ ఉపగ్రహం ఉనికిలో లేకపోవచ్చని సెంటర్ ఫర్ ఆస్ట్రోఫిజిక్స్ (సీఎఫ్‌ఏ) పరిశోధకుడు గాంగ్జీ లీ తెలిపారు. దాదాపు నెప్ట్యూన్ బరువున్న ఈ ‘ప్లానెట్ 9’ దీర్ఘవృత్తాకార కక్ష్యలో సూర్యుని చుట్టూ 22500 కోట్ల కి. మీ. దూరంలో పరిభ్రమిస్తున్నట్టు భావించారు. ఇది నిజంగానే ఉంటే అంత దూరంలో తిరుగుతూ సూర్యుని ఆకర్షణ శక్తికి లోబడి పరిభ్రమించడం అసాధ్యం కనుక తొమ్మిదో గ్రహం ఉనికి ఉండకపోవచ్చని ఆయన తెలిపారు.