వాషింగ్టన్: త్వరలోనే మన సౌర వ్యవస్థలోకి మరో గ్రహం వచ్చి చేరబోతోందా.. ? అంటే అవుననే అంటున్నారు శాస్త్రవేత్తలు. ఇప్పటికే ఉందని భావిస్తున్న ప్లానెట్–9 గ్రహం కంటే ముందుగా ప్లానెట్–10 అనే మరో గ్రహానికి సంబంధించిన ఆనవాళ్లను శాస్త్రవేత్తలు తాజాగా గుర్తించారు.
మన సౌర వ్యవస్థ బాహ్య వలయంలో అంతు చిక్కని ప్లానెట్–10 అనే గ్రహం ఒకటి దాగి ఉండే అవకాశం ఉందని తాజా పరిశో« దనలో వెలుగుచూసింది. అంగారకుడి లాంటి గ్రహం ఒకటి మన సౌర వ్యవస్థ చుట్టూ పరిభ్రమిస్తోన్న ఆధారాలు లభించాయని, బహుశా ఇది ప్లానెట్–10 కావచ్చని ఈ పరిశోధనలో భాగమైన భారత సంతితి శాస్త్రవేత్త, అమెరికాలోని అరిజోనా యూనివర్సిటీలో పనిచేస్తున్న రేణు మల్హోత్రా వెల్లడించారు.