హబుల్‌కంటే వందరెట్లు పెద్ద!
వాషింగ్టన్: హబుల్ కంటే వందరెట్లు పెద్దదైన టెలిస్కోపు నిర్మాణ పనుల్ని నాసా శాస్త్రవేత్తలు ప్రారంభించారు. వైడ్ ఫీల్డ్ ఇన్‌ఫ్రారెడ్ సర్వే టెలిస్కోప్(డబ్ల్యూ.ఎఫ్.ఆర్.ఎస్.టి)గా పిలిచే దీని సాయంతో కృష్ణ బిలాలు, విశ్వ ఆవిర్భావం, గ్రహాంతర వాసుల గుట్టును చేధించేందుకు ప్రయత్నిస్తారు. కాస్మోస్ పరిణామం వివరించేందుకు పరిశోధనకులకు ఇది ఉపయోగపడుతుందని భావిస్తున్నారు. సౌరవ్యవస్థకు అవతల ఉన్న గ్రహాల పరిశోధనతో పాటు, మానవ నివాస యోగ్య గ్రహాల్ని కనుగొనడంలో కీలక పాత్ర పోషిస్తుందని అంచనా వేస్తున్నారు. 2020లో దీన్ని అంతరిక్షంలో ప్రవేశపెడతారు.