ఫ్లూటోకి ఆవల మరో గ్రహం!
సౌర కుటుంబంలోని 9 గ్రహాల్లో ఫ్లూటోని చిట్టచివరి గ్రహంగా ఇంతవరకు పరిగణిస్తున్నాం.. కాని అది సరికాదని ఫ్లూటోకి ఆవల కొన్ని లక్షల మైళ్ల దూరంలో పూర్తిస్థాయి గ్రహ లక్షణాలు గల గ్రహాన్ని కనుగొన్నామని కాలిఫోర్నియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీకి చెందిన ఇద్దరు ఖగోళ శాస్త్రవేత్తలు బుధవారం వెల్లడించారు. కొత్తగా కనుగొన్న ఈ గ్రహం చుట్టూ దట్టమైన వాతావరణం ఆవహించి ఉందన్నారు. దీని ద్రవ్యరాశి భూమి కంటే 10 రెట్లు అధికంగా, ఫ్లూటో కంటే 4,500 రెట్లు ఎక్కువగా ఉందన్నారు. సూర్యుని చుట్టూ ఒకసారి పరిభ్రమించడానికి ఈ గ్రహానికి 10 నుంచి 20 వేల సంవత్సరాలు పడుతుందన్నారు.