California Institute of Technology
-
కాంతిని స్లోమోషన్లో చూడాలనుందా?
వాషింగ్టన్: కాంతిని అత్యంత స్లో మోషన్లో బంధించగల ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన కెమెరాను శాస్త్రవేత్తలు రూపొందించారు. ఈ కెమెరా సెకనుకి 10 లక్షల కోట్ల ఫ్రేమ్స్‌ను కేప్చర్ చేయగలదని తెలిపారు. ఇంత వరకు అంతుచిక్కని కాంతి, పదార్థం మధ్య జరిగే చర్యల గురించి తెలుసుకునేందుకు ఇది దోహదపడుతుందని భావిస్తున్నారు. ఈ కెమెరాను అమెరికాలోని కాలిఫోర్నియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీకి చెందిన పరిశోధకులు అభివృద్ధి చేశారు. కాంతి అధ్యయన శాస్త్రంలో ఇటీవల పుట్టుకొచ్చిన కొత్త ఆవిష్కరణల వల్ల జీవ, భౌతిక శాస్త్రాల్లో అతి సూక్ష్మ విశ్లేషణలకు కొత్త దారులు తెరుచుకున్నాయి. ఈ పద్ధతులను వినియోగించుకోవాలంటే, ఒకేసారి షార్ట్ టెంపోరల్ రిజల్యూషన్‌లో చిత్రాలను కచ్చితత్వంతో రికార్డు చేయాలి. అయితే ప్రస్తుతం ఉన్న ఇమేజింగ్ పద్ధతుల ద్వారా అల్ట్రాషార్ట్ లేజర్ పల్సస్ పద్ధతి ద్వారా ఈ విశ్లేషణలు చేయడం చాలా కష్టంతో కూడుకున్నది. కంప్రెస్డ్ అల్ట్రాఫాస్ట్ ఫొటోగ్రఫీ (కప్) టెక్నాలజీ కొంతమేరకు ఉపయోగకరంగా ఉన్నా.. పూర్తిస్థాయిలో సంతృప్తికరంగా లేదని తెలిపారు. ఇప్పుడు ఈ టెక్నాలజీనే మరింత మెరుగుపర్చి నూతన సాంకేతికతను శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. సెకనుకు క్వాడ్రిలియన్ ఫ్రేమ్స్‌ను బంధించే ఫెమ్టో సెకండ్ సామర్థ్యమున్న కెమెరాకు స్థిర చిత్రాలను బంధించే మరో కెమెరాను జతచేశారు. దీంతో అత్యంత నాణ్యమైన చిత్రాలను సెకనుకి 10 ట్రిలియన్ల ఫ్రేమ్స్ వరకు బంధించవచ్చని కాల్టెక్ ఆప్టికల్ ఇమేజింగ్ లాబోరేటరీ(కాయిల్) డైరెక్టర్ లిహాంగ్ వాంగ్ వెల్లడించారు. టీ–కప్‌గా పిలిచే ఈ నూతన కెమెరా సాయంతో బయో మెడికల్, మెటీరియల్ సైన్స్, ఇతర విభాగాలకు అవసరమైన కొత్తతరం మైక్రోస్కోప్‌లను అభివృద్ధి చేయవచ్చని వాంగ్ తెలిపారు. ఈ కెమెరాను ఉపయోగించి తొలుత 25 ఫ్రేములలో 400 ఫెమ్టో సెకన్ల వ్యవధిలోనే కాంతి పుంజం ఆకారం, తీవ్రత, పరావర్తన కోణాన్ని పరిశీలించినట్లు చెప్పారు. దీని వేగాన్ని భవిష్యత్తులో సెకనుకు క్వాడ్రిలియన్ ఫ్రేములకు పెంచడానికి అవకాశాలున్నట్లు పేర్కొన్నారు. -
మెదడుపై ఒంటరితనం ప్రభావం..
కాలిఫోర్నియా : ఒంటరితనం మెదడులో ఉత్పత్తయ్యే రసాయనాల్లో మార్పులకు కారణమై భయం, దుందుడుకు ధోరణులకు దారితీస్తుందని తాజా అథ్యయనం వెల్లడించింది. ఆధునిక జీవనశైలితో నలుగురిలో కలవడం తగ్గిపోవడంతో కుంగుబాటు, ఒత్తిడి పెరిగి తీవ్ర అనారోగ్యాల ముప్పు ముంచుకొస్తోందని పేర్కొంది. ఎలుకల్లో చేసిన పరిశోధనలో కాలిఫోర్నియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ పరిశోధకులు తేల్చిన అంశాలు మానసిక అస్వస్థతలను నివారించే క్రమంలో ముందడుగుగా భావిస్తున్నారు. గతంలో వృద్ధుల్లో ఒంటరితనం సమస్య వేధించేదని, ప్రస్తుతం 18 నుంచి 22 ఏళ్లలోపు యువతను ఒంటరితనం ఉక్కిరిబిక్కిరి చేస్తోందని పరిశోధకులు పేర్కొన్నారు. ఒంటరితనం కుంగుబాటు, ఉద్వేగ సమస్యలకు దారితీయడంతో పాటు శారీరక అనారోగ్యాలపైనా ప్రభావం చూపుతుందని పరిశోధనలో తేలింది. ఒంటరితనంతో బాధపడే వారు ఒత్తిడి హార్మోన్ కార్టిసోల్‌ను అధికంగా విడుదల చేయడంతో శరరంలో వాపులకు కారణమవుతుందని పరిశోధకులు తేల్చారు. తీవ్రమైన ఒంటరితనానికి లోనవుతున్నామనుకునే వారిలో గుండె జబ్బులు, టైఫ్ టూ మధుమేహం, డిమెన్షియా వ్యాధుల ముప్పు అధికమని పరిశోధకులు తేల్చారు. -
అక్కడ చదివితే జాబ్ పక్కా..!
ఈ విద్యాసంస్థల్లో చదివితే జాబ్ పక్కా.. చదువు పూర్తి కాగానే ఉద్యోగం మిమ్మల్ని వెతుకుంటూ వస్తుందని అంటోంది టైమ్స్ సర్వే.. ఈ మేరకు ఉద్యోగ కల్పనలో ముందున్న టాప్ టెన్ యూనివర్సిటీలకు ‘టైమ్స్ హైయర్ ఎడ్యూకేషన్ ఎంప్లయిబిలిటీ ర్యాంకింగ్స్’ను ప్రకంటించింది. ఈ ర్యాంకుల్లో అమెరికాలోని టాప్ యూనివర్సిటీలు ముందంజలో ఉన్నాయి. ఇక్కడి విద్యాసంస్థల్లో చదువుకుంటున్నవారిలో 80 శాతం మందికి ఉద్యోగాలు వచ్చాయని తెలిపింది. ఈ సర్వేలో మరిన్ని ఆసక్తికరమైన విషయాలు వెలుగుచూశాయి. 2017 సంవత్సరంలో ప్రపంచంలోని ఏ కాలేజీ విద్యార్థులకు ఎక్కువ ఉద్యోగాలు వచ్చాయి అని సర్వే చేస్తే అమెరికాలోని కాలేజీలే అగ్ర స్థానాలలో నిలిచాయి. జాతీయ, అంతర్జాతీయ కంపెనీలు సైతం ఇక్కడ చదువుకున్న వారికే ఉద్యోగాలు ఇవ్వడానికి ఎక్కువ మొగ్గు చూపుతున్నాయని తేలింది. అత్యధిక ఉద్యోగాలు కల్పిస్తున్న టాప్-టెన్ విద్యాసంస్థల్లో అమెరికా కాలేజీలు మొదటి మూడు స్థానాల్లో ఉండటం విశేషం. మొదటి స్థానంలో కాలిఫోర్నియా ఇస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నిలిచింది. ఇక్కడ సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన అత్యుత్తమ విద్యాబోధన సాగడమే ఇందుకు కారణం అని సర్వే పేర్కొంది. రెండో స్థానంలో హార్వర్డ్ యూనివర్సిటీ, మూడో స్థానంలో కొలంబియా యూనివర్సిటీ నిలిచాయి. ఇక, యూనివర్సిటీ ఆఫ్ కేంబ్రిడ్జ్ ఐదో స్ధానంలో, టెక్నికల్ యూనివర్సిటీ ఆఫ్ మ్యూనిచ్ ఎనిమిదో స్థానంలో, యూనివర్సిటీ ఆఫ్ టోక్యో తొమ్మిదో స్థానంలో నిలిచాయి. టైమ్స్ హైయర్ ఎడ్యూకేషన్ ఎంప్లయిబిలిటీ.. టాప్‌టెన్ ర్యాంకులివే.. -
ఆ వర్సిటీ డిగ్రీలకు.. డిమాండ్ కొంచెం ఎక్కువ..
కాలిఫోర్నియా: ఎంతో కష్టపడి డిగ్రీ పట్టాను పొందడం ఒక ఎత్తైతే, ఆ సర్టిఫికెట్లతో ఉద్యోగం పొందడం నేటి యువతకు మరో సవాలే. అయితే కళాశాల్లో విద్యాబోధనే కాకుండా వృత్తి విషయాల్లో నైపుణ్యాన్ని కూడా పెంపొందిస్తూ ఉద్యోగ కల్పనలో కూడా ముందున్న టాప్ 10 యూనివర్సిటీల జాబితాను టైమ్స్ హైయ్యర్ ఎడ్యుకేషన్ వెల్లడించింది. ప్రపచవ్యాప్తంగా గ్రాడ్యుయేషన్ పూర్తవ్వగానే వెంటనే ఉద్యోగం లభించే ఉత్తమ టాప్ యూనివర్సిటీలను 'గ్లోబల్ యూనివర్సిటీ ఎంప్లాయబిలిటీ ర్యాంకింగ్ 2016' పేరిట జాబితాను విడుదల చేసింది. 20 దేశాల్లోని టాప్ 2500 సంస్థల యాజమాన్యాల ఒపీనియన్ ఆధారంగా, 34 దేశాల్లోని 150 యూనివర్సిటీల్లో విద్యనభ్యసించిన విద్యార్థుల ఉద్యోగ అవకాశాలను పరిగణలోకి తీసుకొని జాబితాను తయారు చేశారు. తమ సంస్థల్లో ఉద్యోగం చేస్తూ ఉత్తమ ప్రతిభ కనబరుస్తున్న వారు డిగ్రీ పట్టా పొందిన యూనివర్సిటీ వివరాలను పరిగణలోకి తీసుకొని యాజమాన్యాలు ఈ ఒపీనియన్ పోల్‌లో పాల్గొన్నాయి. ఈ జాబితాలో టాప్ 3 ర్యాంకులను అమెరికా కైవసం చేసుకుంది. ఏకంగా టాప్ 10 జాబితాలో 6 యూనివర్సిటీలు యూఎస్‌కు చెందినవి ఉండటం విశేషం. ఈ జాబితాలో తొలి మూడు స్థానాల్లో అమెరికాకు చెందిన కాలిఫోర్నియా ఇన్సిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, మసాచూసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఎంఐటీ), హార్వర్డ్ యూనివర్సిటీలు నిలిచాయి. యూకేకు చెందిన రెండు జపాన్, జర్మనీకి చెందిన చెరో యూనివర్సిటీలకు ఈ జాబితాలో చోటు దక్కింది.ఇక, టాప్ 20లో చైనా, సింగపూర్, కెనడా, ఫ్రాన్స్‌లకు చెందిన యూనివర్సిటీలకు చోటు దక్కింది. ఉద్యోగాల కల్పనలో టాప్ 10 యూరివర్సిటీలు 1.కాలిఫోర్నియా ఇన్సిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, యూఎస్ 2.మసాచూసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఎంఐటీ), యూఎస్ 3.హార్వర్డ్ యూనివర్సిటీ, యూఎస్ 4.యూనివర్సిటీ ఆఫ్ కేంబ్రిడ్జ్, యూకే 5.స్టాన్ ఫర్డ్ యూనివర్సిటీ, యూఎస్ 6.యేల్ యూనివర్సిటీ, యూఎస్ 7.యూనివర్సిటీ ఆఫ్ ఆక్స్ ఫర్డ్, యూకే 8.యూనివర్సిటీ ఆప్ మ్యూనిచ్ 9.ప్రిన్స్టన్ యూనివర్సిటీ 10.యూనివర్సిటీ ఆఫ్ టోక్యో -
ఫ్లూటోకి ఆవల మరో గ్రహం!
సౌర కుటుంబంలోని 9 గ్రహాల్లో ఫ్లూటోని చిట్టచివరి గ్రహంగా ఇంతవరకు పరిగణిస్తున్నాం.. కాని అది సరికాదని ఫ్లూటోకి ఆవల కొన్ని లక్షల మైళ్ల దూరంలో పూర్తిస్థాయి గ్రహ లక్షణాలు గల గ్రహాన్ని కనుగొన్నామని కాలిఫోర్నియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీకి చెందిన ఇద్దరు ఖగోళ శాస్త్రవేత్తలు బుధవారం వెల్లడించారు. కొత్తగా కనుగొన్న ఈ గ్రహం చుట్టూ దట్టమైన వాతావరణం ఆవహించి ఉందన్నారు. దీని ద్రవ్యరాశి భూమి కంటే 10 రెట్లు అధికంగా, ఫ్లూటో కంటే 4,500 రెట్లు ఎక్కువగా ఉందన్నారు. సూర్యుని చుట్టూ ఒకసారి పరిభ్రమించడానికి ఈ గ్రహానికి 10 నుంచి 20 వేల సంవత్సరాలు పడుతుందన్నారు.