ఆ వర్సిటీ డిగ్రీలకు.. డిమాండ్ కొంచెం ఎక్కువ..
ఆ వర్సిటీ డిగ్రీలకు.. డిమాండ్ కొంచెం ఎక్కువ..
Published Wed, Dec 14 2016 12:04 PM | Last Updated on Mon, Sep 4 2017 10:44 PM
కాలిఫోర్నియా: ఎంతో కష్టపడి డిగ్రీ పట్టాను పొందడం ఒక ఎత్తైతే, ఆ సర్టిఫికెట్లతో ఉద్యోగం పొందడం నేటి యువతకు మరో సవాలే. అయితే కళాశాల్లో విద్యాబోధనే కాకుండా వృత్తి విషయాల్లో నైపుణ్యాన్ని కూడా పెంపొందిస్తూ ఉద్యోగ కల్పనలో కూడా ముందున్న టాప్ 10 యూనివర్సిటీల జాబితాను టైమ్స్ హైయ్యర్ ఎడ్యుకేషన్ వెల్లడించింది.
ప్రపచవ్యాప్తంగా గ్రాడ్యుయేషన్ పూర్తవ్వగానే వెంటనే ఉద్యోగం లభించే ఉత్తమ టాప్ యూనివర్సిటీలను 'గ్లోబల్ యూనివర్సిటీ ఎంప్లాయబిలిటీ ర్యాంకింగ్ 2016' పేరిట జాబితాను విడుదల చేసింది.
20 దేశాల్లోని టాప్ 2500 సంస్థల యాజమాన్యాల ఒపీనియన్ ఆధారంగా, 34 దేశాల్లోని 150 యూనివర్సిటీల్లో విద్యనభ్యసించిన విద్యార్థుల ఉద్యోగ అవకాశాలను పరిగణలోకి తీసుకొని జాబితాను తయారు చేశారు. తమ సంస్థల్లో ఉద్యోగం చేస్తూ ఉత్తమ ప్రతిభ కనబరుస్తున్న వారు డిగ్రీ పట్టా పొందిన యూనివర్సిటీ వివరాలను పరిగణలోకి తీసుకొని యాజమాన్యాలు ఈ ఒపీనియన్ పోల్లో పాల్గొన్నాయి.
ఈ జాబితాలో టాప్ 3 ర్యాంకులను అమెరికా కైవసం చేసుకుంది. ఏకంగా టాప్ 10 జాబితాలో 6 యూనివర్సిటీలు యూఎస్కు చెందినవి ఉండటం విశేషం. ఈ జాబితాలో తొలి మూడు స్థానాల్లో అమెరికాకు చెందిన కాలిఫోర్నియా ఇన్సిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, మసాచూసెట్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఎంఐటీ), హార్వర్డ్ యూనివర్సిటీలు నిలిచాయి.
యూకేకు చెందిన రెండు జపాన్, జర్మనీకి చెందిన చెరో యూనివర్సిటీలకు ఈ జాబితాలో చోటు దక్కింది.ఇక, టాప్ 20లో చైనా, సింగపూర్, కెనడా, ఫ్రాన్స్లకు చెందిన యూనివర్సిటీలకు చోటు దక్కింది.
ఉద్యోగాల కల్పనలో టాప్ 10 యూరివర్సిటీలు
1.కాలిఫోర్నియా ఇన్సిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, యూఎస్
2.మసాచూసెట్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఎంఐటీ), యూఎస్
3.హార్వర్డ్ యూనివర్సిటీ, యూఎస్
4.యూనివర్సిటీ ఆఫ్ కేంబ్రిడ్జ్, యూకే
5.స్టాన్ ఫర్డ్ యూనివర్సిటీ, యూఎస్
6.యేల్ యూనివర్సిటీ, యూఎస్
7.యూనివర్సిటీ ఆఫ్ ఆక్స్ ఫర్డ్, యూకే
8.యూనివర్సిటీ ఆప్ మ్యూనిచ్
9.ప్రిన్స్‌టన్ యూనివర్సిటీ
10.యూనివర్సిటీ ఆఫ్ టోక్యో
Advertisement
Advertisement