సాక్షి, హైదరాబాద్: ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీల్లో బోధన భేష్ అని మరోసారి రుజువైంది. ఏటేటా బోధనను మెరుగుపరుచుకుం టూ ముందుకు సాగుతున్నట్లు తేలింది. టైమ్స్ హయ్యర్ ఎడ్యుకేషన్ ప్రకటించిన వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్‌లో ఈ విషయం స్పష్టమైంది. గురువారం వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్– 2019 నుంచి టైమ్స్ హయ్యర్ ఎడ్యుకేషన్ ప్రకటించింది.
ప్రపంచవ్యాప్తంగా 1,250 యూనివర్సిటీలకు వాటిల్లో బోధన, ప్రమాణాలను బట్టి ర్యాంకింగ్‌లను ఇచ్చింది. టైమ్స్ హయ్యర్ ఎడ్యుకేషన్ చేసిన సర్వేలో బెంగళూరు ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (ఐఐఎస్‌సీ)లో బోధనకు ఈసారి 56.7 పాయింట్ల స్కోర్ లభించింది. అలాగే ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బాంబేకు బోధనలో 44.3 పాయింట్ల స్కోర్ లభించింది. ఇలా మన ఐఐటీలు ఏటా బోధనను మెరుగుపరుచుకుంటూ ముందుకు సాగుతున్నట్లు వెల్లడైంది.
మళ్లీ ఐఐఎస్‌సీనే టాప్..
ఇక మన దేశానికి వస్తే ప్రపంచవ్యాప్తంగా ఉన్న 1,250 ఉత్తమ యూనివర్సిటీల జాబితాలో మన దేశానికి చెందిన 49 విద్యా సంస్థలు చోటు దక్కించుకున్నాయి. ఇందులో ఎప్పటిలాగే బెంగళూరులోని ఐఐఎస్‌సీ 251–300 ర్యాంకుతో మన దేశంలో మొదటి స్థానంలో నిలిచింది.
గతేడాది కూడా ఐఐఎస్సీనే అదే ర్యాంకుతో దేశంలో మొదటి స్థానంలో ఉంది. 2018 ర్యాంకింగ్‌లో రెండో స్థానంలో ఉన్న 351–400 ర్యాంకుతో రెండో స్థానంలో ఉన్న ఐఐటీ బాంబే 2019 ర్యాంకింగ్‌లో మాత్రం కొంత వెనుకబడింది. 401–500 ర్యాంకుతో మూడో స్థానంలో నిలిచింది. ఈసారి 351–400 ర్యాంకుతో ఐఐటీ ఇండోర్ రెండో స్థానంలో నిలవడం విశేషం. ఆసియా యూనివర్సిటీల పరంగా చూస్తే ఐఐఎస్‌సీ 29వ స్థానంలో నిలిచింది. తొలిసారిగా ఈ జాబితాలో ఐఐటీ ఇండోర్ దేశంలో రెండో స్థానాన్ని దగ్గించుకుంది.
ఈసారి ఐఐటీ హైదరాబాద్‌కు స్థానం..
వరల్డ్ యూనివర్సిటీల ర్యాకింగ్‌లో ఈసారి ఐఐటీ హైదరాబాద్‌కు స్థానం దక్కింది. 601–800 ర్యాంకుతో ఐఐటీ హైదరాబాద్ స్థానం దక్కించుకుంది. ఇక ఉస్మానియా యూనివర్సిటీ గతేడాదిలాగే ఈసారి కూడా 801–1,000 ర్యాంకుతో తన స్థానాన్ని పదిలం చేసుకుంది. వీటితోపాటు ఐఐటీ భువనేశ్వర్, ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ పుణే, కోల్‌కతా, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన నాగార్జున యూనివర్సిటీ, శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ, ఆంధ్రా యూనివర్సిటీలకు ఈ ఏడాది ర్యాంకింగ్ జాబితాలో చోటు లభించింది.
Comments
Please login to add a commentAdd a comment