
ప్రతీకాత్మక చిత్రం
కాలిఫోర్నియా : ఒంటరితనం మెదడులో ఉత్పత్తయ్యే రసాయనాల్లో మార్పులకు కారణమై భయం, దుందుడుకు ధోరణులకు దారితీస్తుందని తాజా అథ్యయనం వెల్లడించింది. ఆధునిక జీవనశైలితో నలుగురిలో కలవడం తగ్గిపోవడంతో కుంగుబాటు, ఒత్తిడి పెరిగి తీవ్ర అనారోగ్యాల ముప్పు ముంచుకొస్తోందని పేర్కొంది. ఎలుకల్లో చేసిన పరిశోధనలో కాలిఫోర్నియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ పరిశోధకులు తేల్చిన అంశాలు మానసిక అస్వస్థతలను నివారించే క్రమంలో ముందడుగుగా భావిస్తున్నారు.
గతంలో వృద్ధుల్లో ఒంటరితనం సమస్య వేధించేదని, ప్రస్తుతం 18 నుంచి 22 ఏళ్లలోపు యువతను ఒంటరితనం ఉక్కిరిబిక్కిరి చేస్తోందని పరిశోధకులు పేర్కొన్నారు. ఒంటరితనం కుంగుబాటు, ఉద్వేగ సమస్యలకు దారితీయడంతో పాటు శారీరక అనారోగ్యాలపైనా ప్రభావం చూపుతుందని పరిశోధనలో తేలింది. ఒంటరితనంతో బాధపడే వారు ఒత్తిడి హార్మోన్ కార్టిసోల్‌ను అధికంగా విడుదల చేయడంతో శరరంలో వాపులకు కారణమవుతుందని పరిశోధకులు తేల్చారు. తీవ్రమైన ఒంటరితనానికి లోనవుతున్నామనుకునే వారిలో గుండె జబ్బులు, టైఫ్ టూ మధుమేహం, డిమెన్షియా వ్యాధుల ముప్పు అధికమని పరిశోధకులు తేల్చారు.
Comments
Please login to add a commentAdd a comment