ఆ రుచి మళ్లీ వచ్చేసింది | Smoking Gun Handheld Food Smoker | Sakshi
Sakshi News home page

ఆ రుచి మళ్లీ వచ్చేసింది

Published Sun, Jul 3 2016 4:10 PM | Last Updated on Mon, Oct 22 2018 2:06 PM

ఆ రుచి మళ్లీ వచ్చేసింది - Sakshi

ఆ రుచి మళ్లీ వచ్చేసింది

ఇంట్లో అమ్మమ్మో, నాన్నమ్మో రోజూ తినేటప్పుడు ఒక మాట అంటుంటారు. కట్టెల పొయ్యి మీద వండిన రుచి ఈ గ్యాస్‌పైన ఎప్పటికీ రాదని. అవును మరి, ఆ రుచి అద్భుతం. ఎన్నిరకాల మసాలాలు వేసినా గ్యాస్‌పై వండితే వచ్చే రుచి, వాసన అంతంత మాత్రమే. మళ్లీ పాతరోజుల్లోకి వెళ్లాలని, కట్టెల మీద వండిన ఆహారాన్ని తినాలని చాలామందికి అనిపిస్తుంది కదూ.. అలా తీసుకెళ్లలేం కానీ, అలాంటి రుచి, వాసనను మాత్రం అందించగలమంటున్నారు ఓ కంపెనీ వారు. అందుకే ఈ ‘స్మోకింగ్ గన్ హ్యాండ్‌హెల్డ్ ఫుడ్ స్మోకర్’ను తయారు చేశారు.

ఇదెలా పని చేస్తుందంటే... ముందుగా గన్ చాంబర్‌లో చిన్నచిన్న కట్టె పుల్లలు, చెక్క పొట్టు, ఎండిన ఆకులు, మసాలా దినుసులు... ఇలా వేటినైనా అందులో వేసి అంటించాలి. తర్వాత దానికున్న పైప్‌ను మీకు కావాలనుకున్న ఫుడ్ బౌల్‌లో పెట్టి మూతపెట్టండి. అంతే ఆరోగ్యకరమైన స్మోక్ మీ వంటకు చేరి... ట్రెడిషనల్ ఫుడ్ తిన్న భావన మీకు తప్పకుండా కలుగుతుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement