Shocking Video Of Car Catches Fire In Washington: సిగరెట్‌ తాగుతూ శానిటైజర్‌ రాసుకున్నాడు- Sakshi
Sakshi News home page

సిగరెట్‌ తాగుతూ శానిటైజర్‌ రాసుకున్నాడు.. ఆ తర్వాత

Published Wed, May 19 2021 3:43 PM | Last Updated on Wed, May 19 2021 9:15 PM

Car Catches Fire After Driver Uses Hand Sanitiser While Smoking Cigarette - Sakshi

వాషింగ్టన్‌: కరోనా వ్యాప్తి మూలంగా చేతలను తరచుగా శుభ్రం చేసుకోవడం మన జీవితంలో ఓ భాగమయ్యింది. సబ్బు, నీరు ఎప్పుడు అందుబాటులో ఉండదు కనుక.. శానిటైజర్‌ వినియోగం  బాగా పెరిగింది. అయితే కొన్ని శానిటైజర్లలో మంటను ఆకర్షించే పదార్థాలు ఉంటాయి. అలాంటి వాటిని వాడినప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండాలి. నిప్పుకు దూరంగా ఉండాలి. ఏ మాత్రం అజాగ్రత్తగా వ్యహరించినా.. ఇదిగో ఇలాంటి భయంకర పరిస్థితులు ఎదురవుతాయి.

ఓ వ్యక్తి కారులో కూర్చుని సిగరెట్‌ వెలిగించుకున్నాడు.. ఆ తర్వాత శానిటైజర్‌తో చేతులు శుభ్రం చేసుకున్నాడు. దాంతో కారులో మంటలు చెలరేగాయి.. చూస్తుండగానే కారు దగ్ధమయ్యింది. అదృష్టం కొద్ది డ్రైవర్‌కు పెద్దగా గాయాలు కాలేదు. ఈ సంఘటన అమెరికాలోని రాక్‌విల్లే షాపింగ్‌ సెంటర్‌ వద్ద గత గురువారం చోటు చేసుకుంది. ప్రత్యక్ష సాక్షులు చెప్పిన దాని ప్రకారం సదరు కారు డ్రైవర్‌ తొలుత సిగరెట్‌ వెలిగించి నోట్లో పెట్టుకున్నాడు.. ఆ తర్వాత చేతులకు శానిటైజర్‌ రాసుకున్నాడు. ఈ క్రమంలో అది కొంత అతడి బట్టల మీద పడింది. ఇదే సమయంలో సిగరెట్‌ నుంచి నిప్పు రవ్వలు బట్టల మీద పడటంతో వెంటనే మంటలు అంటుకున్నాయి. 

ప్రమాదం గమనించిన డ్రైవర్‌ వెంటనే కారు నుంచి బయటకు దూకాడు. ఈ ప్రమాదంలో అతడికి పెద్దగా గాయాలు కాలేదు. ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఇక చూస్తుండగానే కారు తగలబడిపోయింది. అగ్ని మాపక సిబ్బంది అక్కడకు చేరుకునే లోపు కారు పూర్తిగా తగలబడింది. ఇక కారులో కూర్చుని సిగరెట్‌, శానిటైజర్‌ వాడటం వల్ల ఈ ప్రమాదం జరిగి ఉంటుందని అగ్నిమాపక సిబ్బంది తెలిపారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో వైరలవుతోంది. 

చదవండి: విలేకరులపై శానిటైజర్‌ స్ప్రే చేసిన ప్రధాని

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement