చైనాలో నడిరోడ్డు మీద పెనుప్రమాదం సంభవించింది. సహజ వాయువు (గ్యాస్)ను తరలిస్తున్న ట్రక్కు ఎక్స్‌ప్రెస్ హైవే మీద బోల్తా కొట్టడంతో ఒక్కసారిగా పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. దీంతో ఆ ట్రక్కు సమీపంలో ఉన్న వాహనాలకు మంటలు అంటుకున్నాయి. భారీ ఎత్తున అగ్నికీలలు ఎగిసిపడ్డాయి. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన ఇద్దరిని సమీపంలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Comments
Please login to add a commentAdd a comment