అందరికీ గ్యాస్ అందించేందుకు చర్యలు
Published Fri, Oct 14 2016 7:08 PM | Last Updated on Thu, Mar 21 2019 8:35 PM
ఏలూరు (మెట్రో) జిల్లాలో కట్టెలతో వంట చేసే సంస్కృతిని మాన్పించి ఇంటింటా వంటగ్యాస్ కనెక్షన్ అందిస్తామని జిల్లా కలెక్టర్ కాటంనేని భాస్కర్ చెప్పారు. స్థానిక కలెక్టర్ కార్యాలయంలో ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, ఛీఫ్ మేనేజర్ మైనాక్ పాత్ర, ఛీప్ ఏరియా మేనేజర్ చింతగడ విజయకుమార్‌లతో గ్యాస్ పంపిణీ తీరుపై కలెక్టర్ చర్చించారు. జిల్లాలో ఏ ఒక్క మహిళా కట్టె పొయ్యలతో వంట చేసే సంస్కతిని తొలగించి పటిష్టమైన వ్యవస్థ ద్వారా ఇంటింటా వంటగ్యాస్ కనెక్షన్లు అందించే ప్రక్రియ వేగవంతం చేస్తున్నామనీ, జిల్లాలో ఇంకా 85వేల మందికి ఇంటింటా వంటగ్యాస్ కనెక్షన్లు ఇవ్వాల్సి ఉందని అవన్నీ 2016 డిసెంబరు నాటికే పూర్తి చేయాలని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చామని కలెక్టర్ చెప్పారు. వంటగ్యాస్ కనెక్షన్లకు వచ్చిన ధరఖాస్తుల్లో 17వేల మంది ఇంటిలో ఇల్లాలు లేక ఒక్కరే ఉంటున్నారని అటువంటి మంగవారికి దీపం కనెక్షన్లు అందించేందుకు గ్యాస్ కంపెనీలు సాకుకూలంగా స్పందించాలని కలెక్టర్ కోరారు. జిల్లాలో ప్రజలకు గ్యాస్ కనెక్షన్లు అందించడంలో ఐఒపి గ్యాస్ కంపెనీ ప్రత్యేక శ్రద్ధ వహించడం అభినందనీయమని భాస్కర్ చెప్పారు. ప్రజలకు వంటగ్యాస్ కనెక్షన్లు అందించడంలో చూపుతున్న శ్రద్ధ ప్రశంసనీయమనీ, ప్రజలకు అధిక సంఖ్యలో గ్యాస్ కనెక్షన్లు అందించడంలో ఉభయ రాష్ట్రాల్లో పశ్చిమ గోదావరి జిల్లా అగ్రస్థానంలో ఉందని కంపెనీ ఛీప్ మేనేజర్ మైనాక్ పాత్ర చెప్పారు. సమావేశంలో జెసి పులిపాటి కోటేశ్వరరావు, డిఎస్‌ఒ శివశంకరరెడ్డి పాల్గొన్నారు.
Advertisement