వరి పొలంలో గ్యాస్ లీకేజీ
Published Sat, May 13 2017 12:19 AM | Last Updated on Tue, Sep 5 2017 11:00 AM
రాజోలు :
గ్రామంలోని వరిపొలంలో శుక్రవారం మధ్యాహ్నం ఓఎన్జీసీ పైపు లైను నుంచి గ్యాస్‌తో కూడిన చమురు లీకయింది. భూగర్భంలో ఏనాడో వేసిన పైపులు తుప్పుపట్టి, పైపుకు ఏర్పడిన పి¯ŒSహోల్ లీకేజీకి దారితీసింది. దాన్ని గుర్తించిన స్థానికులు అధికారులకు సమాచారం ఇవ్వడంతో మోరి గ్యాస్ కలెక్ష¯ŒS స్టేష¯ŒS సిబ్బంది వచ్చి లీకేజీని అరికట్టేందుకు చర్యలు తీసుకున్నారు. దీంతో గ్రామస్తులు ఊపిరి పీల్చుకున్నారు. మండలంలోని అంతర్వేదికరలోని సెయింట్ మేరీ పబ్లిక్ స్కూల్ సమీపంలోని కేవీ 13, 14 బావులకు సంబంధించిన పైపులైన్లతో పాటు ఇతర ప్రాంతాలకు చెందిన మరో ఏడు బావుల పైపులైన్లు కేశవదాసుపాలెంలోని వరిపొలాల మీదుగా మోరి జీసీఎస్ వరకూ వేశారు. తొలుత తొమ్మిది పైపులైన్లలో ఏ లైనులోని పైపునుంచి లీకేజీ అవుతోందో గుర్తించడం సిబ్బందికి కష్టతరమైంది. జీసీఎస్ వద్ద ఆయా బావుల పైపులను బంద్ చేస్తూ చివరికి 13, 14 బావులకు చెందిన పైపులను మూసివేయడంతో, ఈ రెండింటికి కలిపి ఉన్న ప్రధాన పైపు నుంచి లీకయినట్టు గుర్తించారు. గ్యాస్, చమురు అదుపులోకి రావడానికి చాలా సమయం పట్టింది. స్టేష¯ŒS సిబ్బంది పీఎం పాటిల్ తదితరులు లీకేజీని అదుపు చేశారు. తహసీల్దారు డీజే సుధాకర్‌రాజు పరిస్థితిని సమీక్షిస్తూ, ఆర్డీఓ గణేష్‌కుమార్‌కు సమాచారం అందజేశారు. ఆర్డీఓ ఆదేశాలతో అదనపు రెవెన్యూ సిబ్బందిని ఆ ప్రాంతంలో ఏర్పాటు చేశారు.
Advertisement
Advertisement