షేల్ గ్యాస్ తవ్వకాలతో అనర్థాలు
షేల్ గ్యాస్ తవ్వకాలతో అనర్థాలు
Published Mon, Jan 23 2017 1:58 AM | Last Updated on Tue, Sep 5 2017 1:51 AM
భీమవరం : షేల్ గ్యాస్ తవ్వకాల వల్ల ఉభయగోదావరి, కృష్ణా జిల్లాల్లోని ప్రజలు దుర్భర పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుందని ప్రొఫెసర్ కె.బాబూరావు ఆందోళన వ్యక్తం చేశారు. భీమవరం క్లాత్ మర్చంట్స్ అసోసియేషన్ హాల్‌లో ఆదివారం సీపీఐ ఆధ్వర్యంలో నిర్వహించిన షేల్ గ్యాస్ వెలికితీత వ్యతిరేక సభలో ఆయన ముఖ్యవక్తగా ప్రసంగించారు. షేల్ గ్యాస్‌ను వెలికితీసేందుకు నాలుగు కిలోమీటర్ల పొడవు ఆ తర్వాత అడ్డంగా పైపులు వేస్తారని దీనికిగాను వివిధ రకాల రసాయనాలతో కూడిన నీటిని పదివేల పౌండ్ల ఒత్తిడితో భూమిలోనికి పంపి షేల్ (నాపరాయి)ని పగులగొడతారన్నారు. దీనివల్ల భూగర్భ జలాలు సైతం కలుషితమై తాగునీటికి ఇబ్బందికర పరిస్థితులు తప్పవని హెచ్చరించారు. షేల్‌గ్యాస్ తవ్వకాలకు అవసరమైన అధునాతన పరిజ్ఞానం ఓఎన్‌జీసీ వద్ద లేదన్నారు.
3 లక్షల ఎకరాలకు ముప్పు
మూడు జిల్లాల్లో సుమారు 70 వేల బావులను తవ్వడానికి రంగం సిద్ధం చేశారని, ఒక్కో బావి వద్ద సుమారు నాలుగు ఎకరాల పంటకు నష్టం తప్పదని, దీంతో సుమారు 3 లక్షల ఎకరాలకుపైగా పంట కోల్పోవాల్సి వస్తుందని బాబూరావు చెప్పారు. షేల్ గ్యాస్ తవ్వకాలకు నీరు ఎక్కువగా ఉపయోగించాల్సి రావడంతో నీటి కొరత ఏర్పడుతుందన్నారు. షేల్‌గ్యాస్ తవ్వకాలకు ఓఎ¯ŒSజీసీ ఇచ్చిన నివేదికలు సక్రమంగా లేవని దీనివల్ల విపరీతమైన భూతాపం పెరిగిపోయే ప్రమా దం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. పర్యావరణ అనుమతులు ఇచ్చే కమిటీలు కూడా ఉత్సవ విగ్రహాలుగా మారాయని, కమిటీలపై ప్రజాప్రతినిధులు పెత్తనంతో ప్రమాదకరమైన వాటికి కూ డా అనుమతులు వస్తున్నాయని బాబూరావు విమర్శిం చారు. మూడు జిల్లాల్లో షేల్‌గ్యాస్ ఆరు లక్షల చదరపు ఘనపుటడుగులు మాత్ర మే ఉందని గుర్తించారని ఇది చాలా తక్కువన్నారు.
పంటల దిగుబడిపై ప్రభావం
షేల్ గ్యాస్ వెలికితీసే క్రమంలో వెలువడే విషవాయువుల కారణంగా డ్రిల్లింగ్ ప్రాంతంలోని 20 కిలోమీటర్ల వరకు పం టల దిగుబడి ఘోరంగా పడిపోతుందని ప్రొఫెసర్ జి.కృష్ణయ్య ఆందోళన వ్యక్తం చేశారు. ఇటువంటి ప్రజావ్యతిరేక విధానాలను అవలంబిస్తున్న ప్రభుత్వ చర్యల ను ప్రతి ఒక్కరూ అడ్డుకోకపోతే భవిష్యత్తులో తీవ్ర పరిణామాలను చవిచూడాల్సి వస్తుందని హెచ్చరించారు. అమెరికా వంటి దేశాలు కూడా షేల్‌గ్యాస్‌ను వ్యతిరేకించాయని స్పష్టం చేశారు. ప్రోగ్రెసివ్ ఫోరం జాతీయ కార్యదర్శి మర్ల విజయకుమార్, సీపీఐ రాష్ట్ర సహాయ కా ర్యదర్శి జేవీ సత్యనారాయణమూర్తి, జిల్లా కార్యదర్శి డేగా ప్రభాకర్, నార్ల వెం కటేశ్వరరావు, నెక్కంటి సుబ్బారావు, ఎ ం.సీతారామ్‌ప్రసాద్, చెల్లబోయిన రం గారావు, లంక కృష్ణమూర్తి పాల్గొన్నారు.
Advertisement
Advertisement