
చంద్రబాబు కరడుగట్టిన కులతత్వ వాది
అమలాపురం టౌన్: ముఖ్యమంత్రి చంద్రబాబు కరడు గట్టిన కుల తత్వవాదని రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా (ఆర్‌పీఐ) రాష్ట్ర అధ్యక్షుడు డీబీ లోక్ ఆరోపించారు. ముఖ్యంగా ఎస్సీలు, బీసీలు అంటే ఆయనకు చిన్న చూపు ఉందని ధ్వజమెత్తారు. స్థానిక అరిగెలవారిపాలెంలో గురువారం సాయంత్రం జరిగిన పార్టీ కార్యకర్తల సమావేశంలో లోక్ మాట్లాడారు. చంద్రబాబు గత చరిత్రను పరిశీలిస్తే ఎస్సీలను, బీసీల్లోని నాయీ బ్రాహ్మణులు తదితర కులాలను అవహేళన చేసి మాట్లాడిన సందర్భాలు ఉన్నాయని ఆయన గుర్తు చేశారు. ఇలా కులాలను అవమానిస్తున్న చంద్రబాబుకు ఇవే ఆఖరి ఎన్నికలని స్పష్టం చేశారు. ఈసారి ఎస్సీలు, బీసీలు చంద్రబాబును చిత్తుగా ఓడించడం ఖాయమన్నారు. ఓడిన తర్వాత తన ఆస్తులను కాపాడుకోవడంలోనే చంద్రబాబుకు భయం పుడుతుందని జోస్యం చెప్పారు. వచ్చే ఎన్నికల్లో ఆయనపై ప్రజలు నిశ్శబ్ద ఉద్యమం చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నారని లోక్ హెచ్చరించారు.
సమావేశంలో మాట్లాడుతున్న
ఆర్‌పీఐ అధ్యక్షుడు డీబీ లోక్