
బాక్సింగ్ పోటీలకు క్రీడాకారుల ఎంపిక
పిఠాపురం: స్థానిక ఆర్‌ఆర్‌బీహెచ్‌ఆర్ కాలేజీ మైదానంలో బుధవారం నిర్వహించిన బాక్సింగ్ పోటీల్లో రాష్ట్ర స్థాయి పోటీలకు క్రీడాకారులను ఎంపిక చేసినట్లు జిల్లా బాక్సింగ్ అసోసియేషన్ అధ్యక్షుడు కె.కృపారావు కోచ్ పి.లక్ష్మణరావు తెలిపారు. వీటికి జిల్లా నలుమూలల నుంచి 25 మంది హాజరుకాగా, 8 మంది మహిళలు, ఇద్దరు పురుషులను ఎంపిక చేశామన్నారు. వీరందరూ ఈ నెల 12, 13వ తేదీలలో విశాఖపట్నంలో జరిగే రాష్ట్ర స్థాయి బాక్సింగ్ యూత్ మెన్ అండ్ వుమెన్ పోటీల్లో పాల్గొంటారన్నారు.
రైళ్లలో చోరీలు చేస్తున్న యువకుడి అరెస్టు
నిడదవోలు: రైళ్లలో దొంగతనాలకు పాల్పడుతున్న నిడదవోలు మండలం సింగవరం గ్రామానికి చెందిన ఉలవలపూడి దుర్గారావును బుధవారం రైల్వే పోలీసులు అరెస్టు చేశారు. భీమవరం రైల్వే సీఐ ఎస్.సోమరాజు తెలిపిన వివరాల ప్రకారం.. ఉలవలపూడి దుర్గారావు కొంత కాలంగా రైళ్లలో ప్రయాణికుల బంగారు ఆభరణాలను దొంగిలిస్తున్నాడు. అలాగే రైలు ఫుట్‌బోర్డుల దగ్గర నిలబడి ఫోన్ మాట్లాడుతున్న ప్రయాణికులను కర్రతో కొట్టి, ఆ ఫోన్లు కిందపడగానే వాటిని తీసుకుని ఉడాయిస్తాడు. ఇలా అతడు దోచుకున్న 18 సెల్‌ఫోన్లు, 30 గ్రాముల బంగారు ఆభరణాలను పోలీసులు స్వాధీనం చేసున్నారు. వాటి విలువ సుమారు రూ. 3.70 లక్షలు ఉంటుందని రైల్వే సీఐ తెలిపారు. తాడేపల్లిగూడెం రైల్వే ఎస్సై పి.అప్పారావు, సిబ్బంది పాల్గొన్నారు.
వృద్ధుడిపై పోక్సో కేసు
నల్లజర్ల: మండలంలోని ఓ పాఠశాలకు చెందిన విద్యార్థులను లైంగికంగా వేధించిన ఓ వృద్ధుడి (హెచ్‌ఐవీ రోగి)పై పోలీసులు పోక్సో కేసు కట్టారు. పిల్లల తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.

బాక్సింగ్ పోటీలకు క్రీడాకారుల ఎంపిక