Is Actress Kajal Is Going To Say Goodbye To Movies For This Reason, Deets Inside - Sakshi
Sakshi News home page

కాజల్‌ అగర్వాల్‌ చివరి సినిమా ఇదేనా?

Published Sun, Jun 11 2023 7:18 PM | Last Updated on Mon, Jun 12 2023 11:46 AM

Kajal Ready To Quit Films This Is Reason - Sakshi

టాలీవుడ్‌ చందమామ కాజల్‌ ఎప్పుడూ సోషల్‌ మీడియాలో చురుగ్గా ఉంటుంది. తన స్నేహితుడు, ప్రియుడు గౌతమ్‌ కిచ్లును వివాహమాడి.. ఆ తర్వాత ఓ పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఒక యంగ్‌ మదర్‌గా తను ఆస్వాదిస్తుంది. తన బిడ్డపై శ్రద్ధ చూపడంలో ఎక్కడా రాజీపడకుండా.. ఎంతో జాగ్రత్తగా  చూసుకుంటూనే గతంలో తను ఒప్పుకున్న సినిమాలు చేస్తూ వస్తుంది.  

(ఇదీ చదవండి: నాడు అర్జున్ రెడ్డి, నేడు యానిమల్‌.. ఇదీ మామూలు అరాచకం కాదు)

తాజాగా కాజల్ సినిమాలకు గుడ్ బై చెప్పనుందని ఓ వార్త సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది. అందుకు ప్రధాన కారణం  తన బాబు (నీల్‌) అని తెలుస్తోంది. సినిమాల్లో ఉంటే నిత్యం బాబుకు దూరంగా ఉండాల్సి వస్తుంది. బాబు ఎదుగుతున్న వేళ.. తల్లి ప్రేమను అందించాలని, అది తన బాధ్యతని కాజల్‌ తెలుపుతుందట. తన భర్త కిచ్లూ కూడా ఇదే చెబుతున్నారట. ఈ విషయంపై త్వరలో అఫిషయల్‌గా కాజల్‌ ప్రకటించనున్నట్లు వార్తలు తెగ వైరల్‌ అవుతున్నాయి. ఇండస్ట్రీలో కూడా ఇదే టాక్ వినిపిస్తుంది. కానీ నిజం తెలియాలంటే కాజల్ క్లారిటీ ఇచ్చే వరకు ఆగాల్సిందే.  ప్రస్తుతం కమల్ హాసన్ 'భారతీయుడు-2' , బాలకృష్ణ 'భగవంత్‌ కేసరి' సినిమాలలో నటిస్తుంది. ఇదే నిజం అయితే..! కాజల్‌ బ్యూటీకి చివరి సినిమా బాలయ్యదే.

(ఇదీ చదవండి: మొగలి రేకులు నటి లహరి సీమంతం.. సోషల్ మీడియాలో వైరల్!)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement