డీఎంకే పార్టీకి సినీ నటి కుష్బూ గుడ్ బై! | Khushboo taken decisionto quit DMK Party | Sakshi
Sakshi News home page

డీఎంకే పార్టీకి సినీ నటి కుష్బూ గుడ్ బై!

Published Mon, Jun 16 2014 7:32 PM | Last Updated on Sat, Sep 2 2017 8:54 AM

డీఎంకే పార్టీకి సినీ నటి కుష్బూ గుడ్ బై!

డీఎంకే పార్టీకి సినీ నటి కుష్బూ గుడ్ బై!

చెన్నై: తమిళ సినీనటి, రాజకీయ నేత కష్బూ డీఎంకే పార్టీకి గుడ్ బై చెప్పారు. గతకొద్దికాలంగా డీఎంకే పార్టీకి దూరంగా ఉంటున్న కుష్బూ ఆపార్టీకి రాజీనామా చేయాలని సోమవారం నిశ్చయించుకున్నారు. మంగళవారం కుష్బూ బీజేపీలో చేరే అవకాశముందని మీడియాలో కథనాలు వెలువడ్డాయి. 
 
చెన్నైలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సరియైన సమయంలో కొన్ని కఠిన నిర్ణయాలు ఓ చిరునవ్వుతో తీసుకోవాలి. ఓ కఠినమైన నిర్ణయాన్ని నేను తీసుకున్నాను అని సోషల్ మీడియా వెబ్ సైట్ ట్విటర్ లో ట్వీట్ చేశారు. 
 
కరుణానిధి కేవలం ఓ పార్టీ నేతనే కాదు, నాకు తండ్రిలాంటి వాడు అని కుష్బూ వ్యాఖ్యలు చేశారు. డీఎంకే అధికారంలో ఉండగా, 2010 మే 15 తేదిన కుష్బూ పార్టీ సభ్యత్వాన్ని తీసుకున్నారు. 
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement