
ఆప్ కన్వీనర్ పదవికి కేజ్రీవాల్ రాజీనామా!
న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్ పదవికి రాజీనామా చేసేందుకు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సిద్ధపడ్డట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. గత గురువారం జరిగిన పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశంలో ఆయన తన రాజీనామాను సమర్పించినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.
కార్యవర్గ సభ్యులంతా ఆయన రాజీనామాను తీవ్రంగా వ్యతిరేకించారని వెల్లడించాయి. పార్టీలోని కొంతమంది నాయకులు.. కేజ్రీవాల్ జోడు పదవులను అనుభవిస్తున్నారని ఆరోపించటంతో కన్వీనర్ పదవి నుంచి తప్పుకోవటానికి సిద్ధపడారని తెలిపాయి.