మరో విండీస్ క్రికెటర్ ఇండియన్ కంపెనీకి ప్రచారకర్తగా వ్యవహరించనున్నాడు. గత కొంత కాలంగా విదేశీ క్రికెటర్లకు మన దేశంలో ఉన్న క్రేజ్‌ను ఉపయోగించుకునేందుకు తమ సంస్థలకు ప్రచార కర్తలుగా పలు సంస్థలు ఉత్సాహం చూపిస్తున్న విషయం తెలిసిందే. ఇదే కోవలో ప్రముఖ స్పోర్ట్స్ ఫ్లాట్‌ఫామ్ ఫన్88, తమ బ్రాండ్ అంబాసిడర్‌గా డారెన్ సామిని నియమించుకుంది. కెప్టెన్‌గా వెస్టిండీస్ టీమ్‌ను టీ20 వల్డ్ కప్ విజేతగా రెండుసార్లు నిలవడంలో కీలకంగా వ్యవహరించిన సామికి, ఆయన ఆటతీరుకు భారత్, ఉపఖండంలో కూడా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.
అంతేకాదు ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో హైదరాబాద్ జట్టుకు కూడా సామి ప్రాతినిధ్యం వహించాడు. మరోవైపు జాతీయ, అంతర్జాతీయ క్రీడలకు సంబంధించిన ప్రముఖ బ్రాండ్ ఫన్88. క్రికెట్, టెన్నిస్, ఫుట్‌బాల్, కబడ్డి, ఇంకా ఎన్నో క్రీడలకు సంబంధించిన విశేషాలను అందించే ఫన్ 88 తరపున సామి పలు రకాల ప్రచార కార్యక్రమాల్లో భాగం పంచుకోనున్నాడు. ‘రెండు దశాబ్దాలుగా 88 సంఖ్య నా జెర్సీ నెంబర్‌గా ఉంది. అందుకే ఈ ఒప్పందం నాకు మరింత ప్రత్యేకం. ఇప్పుడు ఫన్88 ద్వారా భారత క్రీడాభిమానులకు మరో రూపంలో చేరువకాబోతున్నాననేది నాకు ఎంతో సంతోషాన్నిస్తోంది అంటున్నారు సామి.
Comments
Please login to add a commentAdd a comment