
మీకు హోలీ.. మాకు విజయ సంబరాలు
వరుస విజయాలతో దూసుకెళ్తున్న టీమిండియాను మానసికంగా దెబ్బతీయడానికి వెస్టిండీస్ సీనియర్ ఆల్ రౌండర్ డారెన్ సామీ తనవంతు ప్రయత్నం మొదలుపెట్టాడు. ఈనెల 6వ తేదీన ఇరు దేశాల మధ్య మ్యాచ్ ఉంది. అదే రోజు హోలీ పండుగ కూడా ఉంది. భారతీయులంతా హోలీ సంబరాలు చేసుకుంటుంటే.. తాము విజయ సంబరాలు చేసుకుంటామని వ్యాఖ్యానించాడు.
టీమిండియా ప్రస్తుతం టోర్నమెంటులో చాలా బాగా ఆడుతోందని, ప్రత్యర్థి ఎవరైనా వాళ్లకు తగిన గౌరవం ఇవ్వాల్సిందేనని అన్నాడు. భారతదేశంపై తమకు మంచి మ్యాచ్లే ఉన్నాయని, అయితే భారతజట్టును కొట్టాలంటే మాత్రం 'ఎ' గ్రేడ్ గేమ్ ఆడాల్సి ఉంటుందని చెప్పాడు.