స్యామీ స్టేడియంలో స్యామీ.. | Darren Sammy Lights up Stadium Named After Him, Zouks Score Historic CPL Win | Sakshi
Sakshi News home page

స్యామీ స్టేడియంలో స్యామీ..

Published Fri, Jul 22 2016 3:53 PM | Last Updated on Mon, Aug 13 2018 8:12 PM

స్యామీ స్టేడియంలో స్యామీ.. - Sakshi

స్యామీ స్టేడియంలో స్యామీ..

గ్రాస్ ఐస్లెట్: కరీబియన్ ప్రీమియర్ లీగ్(సీపీఎల్)లో డారెన్ స్యామీ కొత్త రికార్డు నమోదు చేశాడు. కరీబియన్ లీగ్ లో సెయింట్ లూసియా జూక్స్ కెప్టెన్ గా వ్యవహరిస్తున్న సామీ.. ఆ లీగ్లో తొలిసారి  అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించాడు.  గురువారం రాత్రి సెయింట్ కిట్స్-నేవిస్ పాట్రియోట్స్తో జరిగిన మ్యాచ్లో స్యామీ 35 బంతుల్లో ఐదు సిక్సర్లు, రెండు ఫోర్లుతో చెలరేగి 59 పరుగులు సాధించాడు. తద్వారా ఈ లీగ్లో అత్యధిక స్కోరును నమోదు చేశాడు. తాజా విజయంతో సెయింట్ లూసియా లీగ్ లోని తదుపరి ఆశలను సజీవంగా ఉంచుకుంది.

ఇదిలా ఉండగా, డారెన్ స్యామీ నేషనల్ స్టేడియంలోనే ఆ క్రికెటర్ సీపీఎల్ అత్యధిక వ్యక్తిగత స్కోరును నమోదు చేయడం మరో విశేషం.  ఈ మ్యాచ్లో సెయింట్ లూసియా జూక్స్ 35 పరుగుల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన సెయింట్ లూసియా జూక్స్  నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 174 పరుగులు చేసింది. ఆ జట్టులో చార్లెస్ (25),మైక్ హస్సీ(26)లు ఫర్వాలేదనిపించారు. అనంతరం బ్యాటింగ్ చేసిన సెయింట్ కిట్స్ 20.0 ఓవర్లలో 139 పరుగులకే పరిమితమై ఓటమి పాలైంది. సెయింట్ కిట్స్ జట్టులో డు ప్లెసిస్(48), స్మట్స్(30) మినహా ఎవరూ రాణించకపోవడంతో ఓటమి తప్పలేదు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement