విండీస్‌దే టి20 సిరీస్ | west indies won T20 series against england team | Sakshi
Sakshi News home page

విండీస్‌దే టి20 సిరీస్

Published Thu, Mar 13 2014 1:00 AM | Last Updated on Sat, Sep 2 2017 4:38 AM

విండీస్‌దే టి20 సిరీస్

విండీస్‌దే టి20 సిరీస్

 చెలరేగిన స్యామీ  
 ఇంగ్లండ్‌తో రెండో మ్యాచ్‌లోనూ గెలుపు
 
బ్రిడ్జ్‌టౌన్: ఇంగ్లండ్‌తో మూడు మ్యాచ్‌ల టి20 సిరీస్‌ను వెస్టిండీస్ మరో మ్యాచ్ మిగిలివుండగానే 2-0తో గెలుచుకుంది. మంగళవారం రాత్రి జరిగిన రెండో వన్డేలో కెప్టెన్ స్యామీ (9 బంతుల్లో 30 నాటౌట్; 2 ఫోర్లు, 3 సిక్స్‌లు) విజృంభించడంతో విండీస్ 5 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. టాస్ నెగ్గి తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్.. బట్లర్ (43 బంతుల్లో 67; 5 ఫోర్లు, 3 సిక్స్‌లు) రాణించడంతో నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 152 పరుగులు చేసింది.
 
 గాయపడిన నరైన్ స్థానంలో జట్టులోకి వచ్చిన విండీస్ బౌలర్ సాంటొకీ (4/21) నాలుగు వికెట్లు పడగొట్టి ఇంగ్లండ్‌ను నియంత్రించాడు. అనంతరం విండీస్ 18.5 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 155 పరుగులు చేసి లక్ష్యాన్ని ఛేదించింది. ఒక దశలో 15 ఓవర్లలో 111/2తో విజయం దిశగా సాఫీగా సాగిపోతున్న వెస్టిండీస్.. ఆపై వెంట వెంటనే మూడు వికెట్లు కోల్పోయి ఇక్కట్లలో పడింది. అయితే స్యామీ చెలరేగి మరో ఏడు బంతులు మిగిలివుండగానే విండీస్‌కు విజయాన్నందించాడు. సాంటొకీకి ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు దక్కింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement