పాక్‌ అభిమానులను ఫూల్స్‌ చేసిన క్రికెటర్‌ | Darren Sammy Plays Hilarious April Fools Day  | Sakshi

Published Mon, Apr 2 2018 3:10 PM | Last Updated on Wed, Jul 25 2018 1:51 PM

Darren Sammy Plays Hilarious April Fools Day  - Sakshi

డారెన్‌ సామీ (ఫైల్‌ ఫొటో)

సాక్షి, హైదరాబాద్‌ :  ఏప్రిల్‌ 1 సందర్భంగా వెస్టిండీస్‌ మాజీ కెప్టెన్‌ డారెన్‌ సామీ అభిమానులను సరదాగా ఆటపట్టించాడు. ఇటీవల పాకిస్తాన్‌ సూపర్‌ లీగ్‌(పీఎస్‌ఎల్‌)లో అదరగొట్టిన ఈ విండీస్‌ స్టార్‌.. అక్కడ ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకున్నాడు.  పీఎస్‌ఎల్‌లో సామీ పెష్వార్‌జల్మీ జట్టుకి సారథ్యం వహించిన విషయం తెలిసందే. 

అయితే గత కొన్నాళ్లుగా విండీస్‌ జాతీయ జట్టుకు దూరంగా ఉంటున్న సామీ..  తాను మళ్లీ తన దేశానికి పాత్రినిధ్యం వహించాలనుకుంటున్నానని, పాక్‌లో జరుగుతున్న టీ20 సిరీస్‌లో పాల్గొంటానని ట్వీట్‌ చేశాడు. ‘మీరు ఇది నమ్మలేరు.. నేను మెరున్‌(విండీస్‌ జెర్సీ)  జెర్సీ వేసుకొని పాక్‌లో మెరుస్తాను.’  అని ట్వీట్‌లో పేర్కొన్నాడు.  ఈ ట్వీట్‌తో షాక్‌కు గురైన అభిమానులు ఆనందంతో పరవశించిపోయారు.

ముఖ్యంగా పాక్‌ నెటిజన్లు సామీ రాకను స్వాగతిస్తూ ట్వీట్ల మీద ట్వీట్లు చేశారు.  మీ జల్మీ జట్టు సహచరుడు హసన్‌ అలీ నిన్ను తొలి బంతిని అవుట్‌ చేయడానికి సిద్దంగా ఉన్నాడు.’ అని ఒకరనగా నీ మాటలు నాకు తియ్యని పాటగా వినబుడుతున్నాయని మరొకరు కామెంట్‌ చేశారు. అయితే మరికొద్ది సేపట్లోనే వారి ఆనందం ఆవిరయ్యేలా చేశాడు ఈ విండీస్‌ మాజీ కెప్టెన్‌.

‘ఇది నేను ఊహించలేదు.. ఇంతటితో మెరున్‌ జెర్సీలో ఆడాలనే నా ఆలోచన ముగిసింది.’  అని ఏప్రిల్‌ ఫూల్‌ చేశాడు. అయితే ఈ ప్రాంక్‌పై సామీ క్షమాపణలు కోరుతూ చాలా మంది తాను జట్టులోకి తిరిగి రావలని కోరుకుంటున్నారని మరో ట్వీట్‌ చేశాడు. సామీ ట్వీట్‌కు పాక్‌ అభిమానులు స్పందించడానికి కూడా ఓ కారణం ఉంది. 9 ఏళ్ల తర్వాత విండీస్‌ జట్టు పాక్‌లో పర్యటిస్తుంది. పైగా ఈ సిరీస్‌కు విండీస్‌ సీనియర్‌ ఆటగాళ్లు సైతం దూరమయ్యారు. ఈ నేపథ్యంలోనే సామీ ‍ట్వీట్‌కు వారు అంతగా స్పందించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement