వెస్టిండీస్ మాజీ కెప్టెన్ డారెన్ సామి పాకిస్తాన్ క్రికెట్‌కు చేసిన అద్భుతమైన సేవలుకుగాను ‘సితార-ఎ-పాకిస్తాన్’ పౌర పురస్కారం అందుకున్నాడు. పాకిస్తాన్ సూపర్ లీగ్‌లో పెషావర్ జల్మీ జట్టుకు డారెన్ సామి హెడ్ కోచ్‌గా పనిచేస్తున్నాడు. అతడు కోచ్‌గా బాధ్యతలు చేపట్టనప్పటి నుంచి పెషావర్ అద్భుతంగా రాణిస్తోంది. ఈ ఏడాది సీజన్‌లో మూడో స్ధానంలో నిలిచింది. అంతే కాకుండా యువ ఆటగాళ్లలో ప్రతిభను వెలికితీసి.. పాకిస్తాన్ క్రికెట్‌కు అత్యుత్తమ ఆటగాళ్లను అందించడంలో సామి కీలక పాత్ర పోషిస్తున్నాడు.
అందుకుగాను పాకిస్తాన్ ప్రతిష్టాత్మక అవార్డుతో అతడిని సత్కరించింది. ఇక వెస్టిండీస్ తరపున 38 టెస్టులు, 126 వన్డేలు,68 టీ20 మ్యాచ్‌లు సమీ ఆడాడు.సమీ సారథ్యంలో విండీస్ జట్టు రెండు సార్లు టీ20 ప్రపంచకప్‌ను కైవసం చేసుకుంది. ఇక ఈ విషయాన్ని సమీ ట్విటర్ వేదికగా వెల్లడించాడు. "నేను సితార-ఈ-పాకిస్తాన్ అవార్డును అందుకుంటున్నాను. నాకు చాలా గర్వంగా ఉంది" అని సమీ ట్విటర్‌లో పేర్కొన్నాడు.
చదవండి: IPL 2022: ‘ప్రపంచకప్ అందుకోవడమే లక్ష్యం’
Comments
Please login to add a commentAdd a comment