రిటైర్మెంట్‌కు ఐపీఎల్ కారణం కాదు: స్యామీ
న్యూఢిల్లీ: టెస్టులకు గుడ్‌బై చెప్పడానికి ఐపీఎల్ కారణం కాదని వెస్టిండీస్ టి20 కెప్టెన్ డారెన్ స్యామీ స్పష్టం చేశాడు. ఇటీవల వెస్టిండీస్ టెస్టు జట్టుకు సారథిగా స్యామీని తప్పించి దినేష్ రామ్‌దిన్‌ను ఎంపిక చేసిన విషయం తెలిసిందే. దీంతో స్యామీ ఈ ఫార్మాట్ నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించాడు. ‘ఈ విషయంలో సెలక్టర్లతో పూర్తిగా చర్చించాను.
టెస్టు జట్టును మరో మెట్టు మీదికి తీసుకెళ్లాలని వారు ఆలోచిస్తున్నారు. వారు చెప్పింది పూర్తిగా విన్నాక జట్టుకు కెప్టెన్‌గా, ఆటగాడిగా నా అవసరం లేదనిపించింది. దీంతో టెస్టుల నుంచి తప్పుకోవడమే మేలనుకున్నాను. అయితే నా ఈ నిర్ణయానికి కారణం ఐపీఎలో మరొకటో కాదు. గతంలో అన్ని ఫార్మాట్లకు నేను కెప్టెన్‌గా బాధ్యతలు నిర్వర్తించాను. జట్టులో స్థిరత్వం కోసం నన్ను కెప్టెన్‌గా ఉండమన్నారు. మార్పు అనేది సహజమే’ అని సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు ఆడుతున్న స్యామీ తెలిపాడు.
నా అవసరం లేదనిపించింది
Published Mon, May 12 2014 2:27 AM | Last Updated on Sat, Sep 2 2017 7:14 AM
Advertisement
Advertisement