డారెన్ స్యామీపై వేటుకు రంగం సిద్ధం
పోర్ట్ ఆఫ్ స్పెయిన్: వెస్టిండీస్ ఆల్రౌండర్ డారెన్ స్యామీపై వేటు వేసేందుకు రంగం సిద్దమయింది. టెస్టు కెప్టెన్సీ నుంచి అతడిని తొలగించనున్నారు. అతడి స్థానంలో వికెట్ కీపర్ దినేష్ రామ్దిన్కు బాధ్యతలు అప్పగించనున్నారు. న్యూజిలాండ్తో జరగనున్న సిరిస్కు విండీస్ టెస్టు కెప్టెన్గా రామ్దిన్ను నియమించనున్నారని 'ట్రినిడాడ్ గార్డియన్' వెల్లడించింది. రామ్దిన్ నియామకానికి కరేబియన్ సెలెక్టర్లు ఆమోదం తెలిపారని పేర్కొంది. కెప్టెన్సీ చేపట్టడానికి రామ్దిన్ కూడా సిద్ధంగా ఉన్నట్టు తెలిపింది.
డారెన్ స్యామీ ప్రస్తుతం భారత్లో జరుగుతున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)లో ఆడుతున్నాడు. హైదరాబాద్ సన్ రైజర్స్ జట్టుకు అతడు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. 2010లో వెస్టిండీస్ కెప్టెన్ స్యామీ నియమితుడయ్యాడు. 2013లో వన్డే కెప్టెన్సీ నుంచి అతడిని తొలగించి ఆల్రౌండర్ డ్వేన్ బ్రేవోకు అప్పగించారు.