స్వదేశంలో వెస్టిండీస్‌తో జరిగే మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ కోసం 14 మంది సభ్యుల ఆస్ట్రేలియా జట్టును ఇవాళ (జనవరి 24) ప్రకటించారు. ఈ సిరీస్ కోసం ఆసీస్ సెలెక్టర్లు రెగ్యులర్ కెప్టెన్ పాట్ కమిన్స్‌కు విశ్రాంతి కల్పించారు. కమిన్స్ గైర్హాజరీలో ఆసీస్ జట్టును మిచెల్ మార్ష్ ముందుండి నడిపించనున్నాడు. ఈ సిరీస్‌కు కమిన్స్‌తో పాటు రెగ్యులర్ ఆటగాళ్లు మిచెల్ స్టార్క్,స్టీవ్ స్మిత్ కూడా దూరంగా ఉండనున్నారు.
సెలెక్టర్లు స్టార్క్, స్మిత్‌లకు కూడా విశ్రాంతి కల్పించారు. ఇటీవలే టెస్ట్, వన్డేలకు రిటైర్మెంట్ ప్రకటించిన డేవిడ్ వార్నర్ జట్టులో చోటు పదిలం చేసుకోగా.. ఇటీవలే ఆసుపత్రిపాలైన గ్లెన్ మ్యాక్స్‌వెల్, పేసర్ నాథన్ ఇల్లిస్ తిరిగి జట్టులోకి వచ్చారు. బిగ్‌బాష్ లీగ్ 2023-24లో భీకర ఫామ్‌లో ఉండిన మ్యాట్ షార్ట్.. డేవిడ్ వార్నర్‌తో కలిసి ఇన్నింగ్స్ ప్రారంభించే అవకాశం ఉంది.
కాగా, విండీస్‌తో టీ20 సిరీస్ ఫిబ్రవరి 9, 11, 13 తేదీల్లో హోబర్ట్, అడిలైడ్, పెర్త్ వేదికలుగా జరుగనుంది. ప్రస్తుతం ఆస్ట్రేలియా జట్టు విండీస్‌తో రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ ఆడుతుంది. తొలి టెస్ట్‌లో ఆసీస్.. విండీస్‌ను 10 వికెట్ల తేడాతో మట్టికరిపించి, సిరీస్‌లో 1-0 ఆధిక్యంలో ఉంది. టెస్ట్ సిరీస్ అనంతరం ఆసీస్-విండీస్‌లు మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో తలపడతాయి.
వన్డే సిరీస్ మెల్‌బోర్న్, సిడ్నీ, కాన్‌బెర్రా వేదికలుగా ఫిబ్రవరి 2, 4, 6 తేదీల్లో జరుగనుంది. వన్డే సిరీస్ కోసం ఆసీస్ జట్టును ఇదివరకే ప్రకటించారు. ఈ సిరీస్‌కు కూడా కమిన్స్ దూరంగా ఉండనుండగా.. అతని గైర్హాజరీలో స్టీవ్ స్మిత్ ఆసీస్ వన్డే జట్లును ముందుండి నడిపించనున్నాడు.
విండీస్‌తో టీ20 సిరీస్‌కు ఆసీస్ జట్టు..
మిచెల్ మార్ష్ (కెప్టెన్), సీన్ అబాట్, జేసన్ బెహ్రెన్‌డార్ఫ్, టిమ్ డేవిడ్, నాథన్ ఎల్లిస్, జోష్ హాజిల్‌వుడ్, ట్రవిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్, గ్లెన్ మాక్స్‌వెల్, మాట్ షార్ట్, మార్కస్ స్టోయినిస్, మాథ్యూ వేడ్, డేవిడ్ వార్నర్, ఆడమ్ జంపా
విండీస్‌తో సిరీస్‌కు ఆసీస్ వన్డే జట్టు..
స్టీవెన్ స్మిత్ (కెప్టెన్), సీన్ అబాట్, జేవియర్ బార్ట్‌లెట్, నాథన్ ఎల్లిస్, కామెరాన్ గ్రీన్, ఆరోన్ హార్డీ, ట్రావిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్, మార్నస్ లాబుస్‌చాగ్నే, జేక్ ఫ్రేజర్-మెక్‌గర్క్, లాన్స్ మోరిస్, మాట్ షార్ట్, ఆడమ్ జంపా
Comments
Please login to add a commentAdd a comment