అడిలైడ్ వేదికగా టీమిండియాతో జరిగే రెండో టెస్ట్ కోసం ఆస్ట్రేలియా జట్టును ఇవాళ (నవంబర్ 28) ప్రకటించారు. ఈ మ్యాచ్ కోసం పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్ బ్యూ వెబ్‌స్టర్‌కు పిలుపు వచ్చింది. ఇప్పటికే జట్టులో ఉన్న పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్ మిచెల్ మార్ష్ ఫిట్‌నెస్ సమస్యతో ఇబ్బంది పడుతుండటంతో ముందు జాగ్రత్తగా చర్యగా వెబ్‌స్టర్‌ను ఎంపిక చేశారు. తొలి టెస్ట్ అనంతరం మార్ష్‌కు స్వల్ప గాయమైనట్లు తెలుస్తుంది.
రెండో టెస్ట్‌లో మార్ష్ తుది జట్టులో చోటు దక్కించుకున్నా కేవలం బ్యాటింగ్‌కు మాత్రమే పరిమితమవుతాడు. ఇదే జరిగితే ఆ జట్టు ఫ్రంట్‌లైన్ పేసర్లు స్టార్క్, హాజిల్‌వుడ్, కమిన్స్‌లపై భారం పడుతుంది.
కాగా, వెబ్‌స్టర్‌కు జాతీయ జట్టు నుంచి పిలుపు రావడం ఇదే తొలిసారి. ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లో వెబ్‌స్టర్‌కు గత రెండు సీజన్‌లలో అద్భుతంగా రాణించాడు. గతేడాది అతను షెఫీల్డ్ షీల్డ్ టోర్నీలో 900కు పైగా పరుగులు చేసి 30 వికెట్లు తీశాడు. షెఫీల్డ్ షీల్డ్ టోర్నీ చరిత్రలో గ్యారీ సోబర్స్ తర్వాత వెబ్‌స్టర్ మాత్రమే ఈ ఘనత సాధించాడు.
ప్రస్తుత ఫస్ట్‌క్లాస్ సీజన్‌లో వెబ్‌స్టర్ ఇప్పటికే 448 పరుగులు చేసి, 16 వికెట్లు తీశాడు. బీజీటీకి ముందు ఇండియా-ఏతో జరిగిన మ్యాచ్‌లో వెబ్‌స్టర్ ఆల్‌రౌండ్ షోతో (61 నాటౌట్, 46 నాటౌట్; 3/19, 3/49) అదరగొట్టాడు.
టీమిండియాతో రెండో టెస్టు కోసం ఆస్ట్రేలియా జట్టు: పాట్ కమ్మిన్స్ (కెప్టెన్), స్కాట్ బోలాండ్, అలెక్స్ కారీ (వికెట్‌కీపర్), జోష్ హేజిల్‌వుడ్, ట్రావిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్, ఉస్మాన్ ఖవాజా, మార్నస్ లబూషేన్, నాథన్ లియోన్, మిచ్ మార్ష్, నాథన్ మెక్‌స్వీనీ, స్టీవ్ స్మిత్, మిచెల్ స్టార్ , బ్యూ వెబ్‌స్టర్
Comments
Please login to add a commentAdd a comment