అడిలైడ్ వేదికగా వెస్టిండీస్‌తో జరిగిన రెండో టీ20లో 34 పరుగుల తేడాతో ఆస్ట్రేలియా ఘన విజయం సాధించింది. దీంతో మూడు టీ20ల సిరీస్‌ను మరో మ్యాచ్ మిగిలూండగానే 2-0తో ఆసీస్ సొంతం చేసుకుంది. ఇక ఇది ఇలా ఉండగా..
ఈ మ్యాచ్‌లో ఓ విచిత్రకర సంఘటన చోటు చేసుకుంది. వెస్టిండీస్ ఇన్నింగ్స్‌లో రనౌట్ విషయంలో ఆసీస్ ఆటగాళ్లు అప్పీల్ చేయకపోవడంతో అంపైర్ ఔట్ ఇవ్వలేదు. ఇది మీకు వినడానికే కొత్తగా ఉండవచ్చు.. అసలేం ఏం జరిగిందో ఓ లూక్కేద్దాం.
అసలేం ఏం జరిగిందంటే?
విండీస్ ఇన్నింగ్స్ 19 ఓవర్‌లో పేసర్ అల్జారీ జోసెఫ్ కవర్స్ వైపు ఆడి క్విక్ సింగిల్ తీసే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో కవర్స్‌లో ఫీల్డింగ్ చేస్తున్న టిమ్ డెవిడ్ బంతిని నాన్ స్ట్రైకర్ ఎండ్‌లో ఉన్న బౌలర్ స్పెన్సర్ జాన్సన్‌కు అందించాడు. బంతిని అందుకున్న స్పెన్సర్ జాన్సన్ బెయిల్స్‌ను పడగొట్టాడు. అయితే అది క్లియర్‌గా ఔట్ అనుకుని జాన్సన్ సెలబ్రేషన్స్ జరుపుకోవడం మొదలు పెట్టాడు.
తర్వాత రిప్లేలో బిగ్ స్క్రీన్‌పై కూడా బెయిల్స్ కిందపడేటప్పటికి జోషఫ్ క్రీజుకు దూరంగా ఉన్నట్లు కన్పించింది. దీంతో ఆసీస్ కెప్టెన్ మిచెల్ మార్ష్‌తో పాటు డేవిడ్ సైతం సెలబ్రేషన్స్‌లో మునిగితేలిపోయారు. అయితే ఇక్కడే అస్సలు ట్విస్ట్ చోటు చేసుకుంది.
ఫీల్డ్ అంపైర్ మాత్రం అతడిని నాటౌట్‌గా ప్రకటించాడు. దీంతో ఆసీస్ ఆటగాళ్లు ఒక్కసారిగా షాకయ్యారు. వెంటనే ఆసీస్ ఆటగాళ్లు అంపైర్‌ను ప్రశ్నించగా.. రనౌట్‌కు ఎవరూ అప్పీల్ చేయకపోవడంతో తన నిర్ణయాన్ని నాటౌట్‌గా ప్రకటించానని బదులిచ్చాడు. అయితే టిమ్ డేవిడ్ మాత్రం తను అప్పీల్ చేశానని అంపైర్‌తో వాగ్వాదానికి దిగాడు.
అతడితో కెప్టెన్ మార్ష్ కూడా అంపైర్ నిర్ణయం పట్ల ఆసంతృప్తి వ్యక్తం చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇది చూసిన నెటిజన్లు క్రికెట్ చరిత్రలోనే అత్యంత అరుదైన ఘటన అంటూ కామెంట్లు చేస్తున్నారు. అయితే ఏంసీసీ రూల్స్‌లోని సెక్షన్ 31.1 ప్రకారం, అప్పీల్ లేకుండా అంపైర్లు బ్యాటర్‌ను అవుట్‌గా ప్రకటించకూడదు.
చదవండి: Ravindra Jadeja: మా కోడలి వల్లే ఇదంతా... మండిపడ్డ రివాబా!
ONE OF THE RAREST MOMENTS ...!!!
— Mufaddal Vohra (@mufaddal_vohra) February 12, 2024
Johnson attempted the run out, big screen showed its out, but nobody appealed so the on-field umpire dismissed the decision. pic.twitter.com/5b0x6y6KaF
Comments
Please login to add a commentAdd a comment