వెస్టిండీస్‌తో జరిగిన తొలి టీ20లో ఆస్ట్రేలియా స్టార్ డేవిడ్ వార్నర్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. తన వందో అంతర్జాతీయ టీ20 మ్యాచ్‌లో వార్నర్.. కరేబియన్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. ఈ క్రమంలో వార్నర్ కేవలం 22 బంతుల్లోనే తన హాఫ్ సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. ఓవరాల్‌గా ఈ మ్యాచ్‌లో 36 బంతులు ఎదుర్కొన్న డేవిడ్ భాయ్ 12 ఫోర్లు, ఒక సిక్స్‌తో 70 పరుగులు చేశాడు.
కాగా వార్నర్‌కు ఇది టీ20ల్లో 100వ హాఫ్ సెంచరీ కావడం గమనార్హం. తద్వారా ఓ అరుదైన ఘనతను వార్నర్ తన పేరిట లిఖించుకున్నాడు. టీ20 క్రికెట్‌లో వంద అర్ధశతకాల మార్క్‌ను అందుకున్న తొలి క్రికెటర్‌గా వార్నర్ చరిత్ర సృష్టించాడు. ఇప్పటివరకు ఓవరాల్‌గా 367 టీ20లు ఆడిన వార్నర్ 100 హాఫ్ సెంచరీలను సాధించాడు.
ఇక ఈ అరుదైన ఘనత సాధించిన జాబితాలో వార్నర్ తర్వాతి స్ధానంలో విరాట్ కోహ్లి(91) ఉన్నాడు. అదే విధంగా ఈ మ్యాచ్‌లో వార్నర్ మరో అరుదైన రికార్డును నమోదు చేశాడు. క్రికెట్‌లోని మూడు ఫార్మాట్లలో 100 మ్యాచ్‌లు ఆడిన తొలి ఆస్ట్రేలియా క్రికెటర్‌గా వార్నర్ రికార్డులకెక్కాడు. అయితే ఓవరాల్‌గా ఈ రికార్డు సాధించిన మూడో ప్లేయర్‌గా వార్నర్ నిలిచాడు. ఈ జాబితాలో డేవిడ్ కంటే ముందు భారత స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లి, న్యూజిలాండ్ మాజీ కెప్టెన్ రాస్ టేలర్ ఉన్నాడు.
చదవండి: 'ప్లీజ్.. నా కొడుకును జడేజాతో పోల్చవద్దు'
Comments
Please login to add a commentAdd a comment