స్వదేశంలో వెస్టిండీస్‌తో వన్డే సిరీస్‌కు ఆస్ట్రేలియా సిద్దమవుతోంది. ఈ సిరీస్ కోసం క్రికెట్ ఆస్ట్రేలియా ఇప్పటికే 13 మంది సభ్యులతో కూడిన తమ జట్టును ప్రకటించింది. అయితే అనుహ్యంగా ఈ జట్టులో చోటు దక్కించుకున్న స్టార్ ఆటగాళ్లు గ్లెన్ మాక్స్‌వెల్, జో రిచర్డ్‌సన్ గాయం కారణంగా దూరమయ్యారు. ఇక తాజాగా వీరిద్దరి స్ధానాన్ని యువ సంచలనం ఫ్రేజర్-మెక్‌గర్క్, ఫాస్ట్ బౌలర్ జేవియర్ బార్ట్‌లెట్‌తో క్రికెట్ ఆస్ట్రేలియా భర్తీ చేసింది.
ఫ్రేజర్-మెక్‌గర్క్ ప్రస్తుతం అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. దేశీవాళీ క్రికెట్‌లో దుమ్ములేపుతున్నాడు. గతేడాది జరిగిన ఆస్ట్రేలియా డొమాస్టిక్ వన్డే టోర్నీలో వరల్డ్ రికార్డు సెంచరీతో మెక్‌గర్క్ చెలరేగాడు. కేవలం 29 బంతుల్లోనే సెంచరీ మార్క్‌ను అందుకున్న మెక్‌గర్క్.. ప్రపంచ క్రికెట్ చరిత్రలో తన పేరును సువర్ణ అక్షరాలతో లిఖించుకున్నాడు.
మెక్‌గర్క్ ప్రస్తుతం యూఏఈ టీ20 లీగ్‌లో దుబాయ్ క్యాపిటిల్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. ఈ టోర్నీలో తన అరంగేట్ర మ్యాచ్‌లోనే మెక్‌గర్క్ అదరగొట్టాడు. 25 బంతుల్లో 54 పరుగులు చేసి సత్తా చాటాడు. మరోవైపు పేసర్ బార్ట్‌లెట్ కూడా దేశీవాళీ క్రికెట్‌లో అద్బుతమైన ప్రదర్శన కనబరిస్తున్నాడు.
బిగ్‌బాష్ లీగ్-2023 సీజన్‌లో లీడింగ్ వికెట్ టేకర్‌గా నిలిచాడు. కాగా ఆసీస్-విండీస్ మధ్య వన్డే సిరీస్ ఫిబ్రవరి 2 నుంచి మెల్‌బోర్న్ వేదికగా ప్రారంభం కానుంది. ఈ సిరీస్‌కు రెగ్యూలర్ కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్ దూరం కావడంతో స్టీవ్ స్మిత్‌కు జట్టు పగ్గాలు అప్పగించారు.
ఆసీస్ వన్డే జట్టు: స్టీవెన్ స్మిత్ (కెప్టెన్), సీన్ అబాట్, జేవియర్ బార్ట్‌లెట్, నాథన్ ఎల్లిస్, కామెరాన్ గ్రీన్, ఆరోన్ హార్డీ, ట్రావిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్, మార్నస్ లాబుస్‌చాగ్నే, జేక్ ఫ్రేజర్-మెక్‌గర్క్, లాన్స్ మోరిస్, మాట్ షార్ట్, ఆడమ్ జంపా.
చదవండి: టెస్టు సిరీస్‌కు బ్రూక్ దూరం
Comments
Please login to add a commentAdd a comment