చరిత్ర సృష్టించిన ఆస్ట్రేలియా (PC: CA)
వెస్టిండీస్‌తో మూడో వన్డే సందర్భంగా ఆస్ట్రేలియా సరికొత్త చరిత్ర సృష్టించింది. తమ వన్డే క్రికెట్ చరిత్రలో అతిపెద్ద విజయాన్ని నమోదు చేసింది. అది కూడా 50 ఓవర్ల క్రికెట్‌లో తమ 1000వ మ్యాచ్‌లో ఈ ఫీట్ అందుకోవడం విశేషం.
కాగా మంగళవారం కాన్‌బెర్రా వేదికగా ఆసీస్ విండీస్‌తో ఆఖరి వన్డేలో తలపడింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బౌలింగ్ చేసిన కంగారూ జట్టు.. విండీస్‌ను 86 పరుగులకే ఆలౌట్ చేసింది.
ఇదే మొదటిసారి
ఆ తర్వాత 6.5 ఓవర్లలోనే అంటే.. ఇంకా 259 బంతులు మిగిలి ఉండగానే లక్ష్యాన్ని ఛేదించింది ఆస్ట్రేలియా. తద్వారా తమ వన్డే చరిత్రలో తొలిసారి ఇలాంటి ఘన విజయం అందుకుంది. ఇంతకు ముందు 2004లో యూఎస్‌ఏ జట్టు మీద ఆసీస్ 253 బంతులు మిగిలి ఉండగా గెలుపొందింది.
టీమిండియా తర్వాత
అదే విధంగా 2013లో వెస్టిండీస్‌తో మ్యాచ్‌లోనే 244 బంతులు మిగిలి ఉండగానే టార్గెట్ పూర్తి గెలుపు జెండా ఎగురవేసింది. ఇక కాన్‌బెర్రా మ్యాచ్ ఆసీస్‌కు 1000వ వన్డే కావడం విశేషం. తద్వారా టీమిండియా తర్వాత అత్యధిక వన్డేలు ఆడిన రెండో జట్టుగా ఆస్ట్రేలియా చరిత్రకెక్కింది. అయితే, ఈ ఫార్మాట్లో ఆస్ట్రేలియా 600కు పైగా మ్యాచ్‌లు గెలిచిన ఏకైక జట్టు కూడా కావడం మరో విశేషం.
వెస్టిండీస్‌తో మూడో వన్డేలో ఆస్ట్రేలియా ఈ మేరకు భారీ విజయం నమోదు చేయడంలో ఓపెనర్లది కీలక పాత్ర. జేక్ ఫ్రాసెర్ మెక్‌గర్క్(18 బంతుల్లోనే ఐదు ఫోర్లు, మూడు సిక్స్‌లతో 41 రన్స్), జోష్ ఇంగ్లిస్( 16 బంతుల్లో 35 పరుగులు(నాటౌట్)) సాధించాడు.
జేక్‌ను అల్జారీ జోసెఫ్ పెవిలియన్‌కు పంపగా తొలి వికెట్ కోల్పోయిన ఆసీస్.. వన్‌డౌన్ బ్యాటర్ ఆరోన్ హార్డీ(2) రూపంలో రెండో వికెట్ కోల్పోయింది. ఈ క్రమంలో ఇంగ్లిస్‌కు తోడైన కెప్టెన్ స్టీవ్ స్మిత్(6- నాటౌట్) విజయ లాంఛనాన్ని పూర్తి చేశాడు. ఈ క్రమంలో వెస్టిండీస్‌తో మూడు వన్డేల సిరీస్‌ను ఆసీస్ 3-0తో వైట్‌వాష్ చేసింది.
చదవండి: IPL 2024: అందుకే రోహిత్‌ను ముంబై కెప్టెన్‌గా తప్పించాం.. కోచ్‌పై రితిక విమర్శలు
Comments
Please login to add a commentAdd a comment