గబ్బా వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో టెస్టులో వెస్టిండీస్ పేసర్లు నిప్పులు చేరుగుతున్నారు. విండీస్ ఫాస్ట్ బౌలర్ల దాటికి ఆసీస్ బ్యాటర్లు విల్లావిల్లాడుతున్నారు. 54 పరుగులకే సగం వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడిన ఆసీస్‌ను.. ఖ్వాజా(75), ఆలెక్సీ క్యారీ(65) అదుకున్నారు.
ప్రస్తుతం 50 ఓవర్లకు ఆసీస్ 8 వికెట్ల నష్టానికి 257 పరుగులు చేసింది. క్రీజులో అసీస్ కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్(53), నాథన్ లయోన్(3) పరుగులతో ఉన్నారు. విండీస్ బౌలర్లలో కీమర్ రోచ్, అల్జారీ జోషప్ 3 వికెట్లు పడగొట్టగా.. షమీర్ జోషప్, కెవిన్ తలా వికెట్ సాధించారు.
అయితే ఈ మ్యాచ్‌లో ఆసీస్ వికెట్ కీపర్ బ్యాటర్ ఆలెక్స్ క్యారీని ఆదృష్టం వరించింది. బంతి వికెట్లను తాకినప్పటికీ క్యారీ ఔటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. ఆసీస్ ఇన్నింగ్స్ 15 ఓవర్‌లో షమీర్ జోషఫ్.. క్యారీకి అద్బుతమైన డెలివరీని సంధించాడు.
సూపర్ డెలివరీ క్యారీ ను బీట్ చేస్తూ బ్యాట్, స్టంప్స్‌కు దగ్గరగా వికెట్ కీపర్ చేతికి వెళ్లింది. వెంటనే బౌలర్‌తో పాటు కీపర్ క్యాచ్‌కు అప్పీల్ చేశారు. అయితే రిప్లేలో బంతి బ్యాట్‌కు కాకుండా స్టంప్స్‌కు తాకినట్లు కన్పించింది. 140 కిలోమీటర్ల వేగంతో స్టంప్స్ ను తాకినా బెయిల్స్ మాత్రం ఇంచు కూడా కదల్లేదు.
ఇది చూసిన అందరూ షాక్‌కు గురయ్యారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కేవలం 8 పరుగుల వద్ద ఔటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్న క్యారీ ఏకంగా 65 పరుగులు చేశాడు.
The bail spun in its groove - but didn't fall! 😱#AUSvWI pic.twitter.com/t6XgOibdqr
— cricket.com.au (@cricketcomau) January 26, 2024
Comments
Please login to add a commentAdd a comment