క్రికెట్ అభిమానుల ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న మహిళల ప్రీమియర్ లీగ్ రెండో సీజన్ షెడ్యూల్ వచ్చేసింది. డబ్ల్యూపీఎల్-2024 టోర్నీ ఫిబ్రవరి 23 నుంచి ప్రారంభం కానుంది. ఈ మెరకు మంగళవారం బీసీసీఐ అధికారిక ప్రకటన చేసింది. బెంగళూరు వేదికగా జరగనున్న తొలి పోరులో డిఫెండింగ్ చాంపియన్ ముంబై ఇండియన్స్, రన్నరప్ ఢిల్లీ క్యాపిటల్స్ తలపడనున్నాయి. తొలి సీజన్‌లో కేవలం ముంబైకే పరిమితమైన . డబ్ల్యూపీఎల్.. ఈ సారి రెండు నగరాల్లో జరగనుంది.
ఈ సీజన్‌లో మొదటి దశ మ్యాచ్‌లు బెంగళూరులో రెండో దశ మ్యాచ్‌లు దిల్లీలో జరగనున్నాయి. ఫిబ్రవరి 23 నుంచి మార్చి 4 వరకు బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో మ్యాచ్‌లు జరగనున్నాయి. అనంతరం మార్చి 5 నుంచి మిగిలిన దశ మ్యాచ్‌లు ఢిల్లీలో జరగనున్నాయి.
మార్చి 15న ఎలిమినేటర్ మ్యాచ్, మార్చి 17న ఫైనల్ మ్యాచ్ ఢిల్లీలో జరగనున్నాయి. మొత్తం అన్ని మ్యాచ్‌లు రాత్రి 7:30 గంటలకు ప్రారంభమవుతాయి. కాగా భారత్‌లో మహిళల క్రికెట్‌ను అభివృద్ది చేసేందుకు గతేడాది డబ్ల్యూపీఎల్ తొలి సీజన్‌కు బీసీసీఐ శ్రీకారం చుట్టింది
డబ్ల్యూపీల్ షెడ్యూల్ 2024
►ఫిబ్రవరి 23- ముంబై ఇండియన్స్ vs ఢిల్లీ క్యాపిటల్స్ (బెంగళూరు)
►ఫిబ్రవరి 24- రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు vs యూపీ వారియర్స్ (బెంగళూరు)
►ఫిబ్రవరి 25- గుజరాత్ జెయింట్స్ vs ముంబై ఇండియన్స్ (బెంగళూరు)
►ఫిబ్రవరి 26- యూపీ వారియర్స్ vs దిల్లీ క్యాపిటల్స్ (బెంగళూరు)
►ఫిబ్రవరి 27- రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు vs గుజరాత్ జెయింట్స్ (బెంగళూరు)
►ఫిబ్రవరి 28- ముంబై ఇండియన్స్ vs యూపీ వారియర్స్ (బెంగళూరు)
►ఫిబ్రవరి 29- రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు vs దిల్లీ క్యాపిటల్స్ (బెంగళూరు)
►మార్చి 1- యూపీ వారియర్స్ vs గుజరాత్ జెయింట్స్ (బెంగళూరు)
►మార్చి 2- రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు vs ముంబై ఇండియన్స్ (బెంగళూరు)
►మార్చి 3- గుజరాత్ జెయింట్స్ vs దిల్లీ క్యాపిటల్స్ (బెంగళూరు)
►మార్చి 4- యూపీ వారియర్స్ vs రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (బెంగళూరు)
►మార్చి 5- దిల్లీ క్యాపిటల్స్ vs ముంబై ఇండియన్స్ (ఢిల్లీ)
►మార్చి 6- గుజరాత్ జెయింట్స్ vs రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఢిల్లీ)
►మార్చి 7- యూపీ వారియర్స్ vs ముంబై ఇండియన్స్ (ఢిల్లీ)
►మార్చి 8- దిల్లీ క్యాపిటల్స్ vs యూపీ వారియర్స్ (ఢిల్లీ)
►మార్చి 9- ముంబై ఇండియన్స్ vs గుజరాత్ జెయింట్స్ (ఢిల్లీ)
►మార్చి 10- దిల్లీ క్యాపిటల్స్ vs రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఢిల్లీ)
►మార్చి 11- గుజరాత్ జెయింట్స్ vs యూపీ వారియర్స్ (ఢిల్లీ)
►మార్చి 12- ముంబయి ఇండియన్స్ vs రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఢిల్లీ)
►మార్చి 13- దిల్లీ క్యాపిటల్స్ vs గుజరాత్ జెయింట్స్ (ఢిల్లీ)
►మార్చి 15- ఎలిమినేటర్ (ఢిల్లీ)
►మార్చి 17- ఫైనల్ (ఢిల్లీ)
చదవండి: అయోధ్యలో కోహ్లిని పోలిన వ్యక్తి.. సెల్ఫీల కోసం ఎగబడ్డ జనం! వీడియో
Comments
Please login to add a commentAdd a comment