ముగిసిన వేలం.. స్మృతి మంధానకు భారీ ధర
తొలి మహిళల ప్రీమియర్ లీగ్‌కు సంబంధించిన వేలం ముగిసింది. ముంబై వేదికగా జరిగిన ఈ వేలంలో మొత్తం 87 మంది క్రికెటర్లు అమ్ముడు పోయారు. క్రికెటర్లను కొనుగోలు చేయడానికి ఐదు ఫ్రాంచైజీలు రూ. 59.5 కోట్ల మొత్తాన్ని వెచ్చించాయి. ఈ వేలంలో టీమిండియా స్టార్ ఓపెనర్ స్మృతి మంధాన అత్యధిక ధర దక్కించుకున్న క్రికెటర్‌గా నిలిచింది.
మంధానను రూ.3.4 కోట్ల భారీ ధరకు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కొనుగోలు చేసింది. అదే విధంగా ఆస్ట్రేలియా స్టార్ ఆల్‌రౌండర్ ఆష్లీ గార్డనర్‌ను గుజరాత్ జెయింట్స్ కోసం రూ. 3.2 కోట్లను వెచ్చించి సొంతం చేసుకుంది. వేలంలో అత్యధిక ధర పలికిన విదేశీ క్రికెటర్‌గా గార్డనర్ నిలిచింది.
►ఇంగ్లండ్ కెప్టెన్ హీథర్ నైట్‌ను రూ.40లక్షలకు రాయల్‌ఛాలెంజర్స్ బెంగళూరు కొనుగోలు చేసింది.
►వెస్టిండీస్ కెప్టెన్ హేలీ మాథ్యూస్‌ను రూ.40లక్షలకు ముంబై ఇండియన్స్ సొంతం చేసుకుంది.
►భారత ఆల్‌రౌండర్ దయాళన్ హేమలతను రూ. 30 లక్షలకు గుజరాత్ జెయింట్స్ కొనుగోలు చేసింది.
►భారత ఆల్‌రౌండర్ దేవికా వైద్యను రూ. 1.4 కోట్లకు యూపీ వారియర్జ్ కొనుగోలు చేసింది.
►ఇంగ్లండ్ ఆల్ రౌండర్ ఆలిస్ క్యాప్సేను రూ. 75 లక్షలకు ఢిల్లీ క్యాపిటల్స్ సొంతం చేసుకుంది.
►ఆంధ్రా క్రికెటర్ సబ్బెనేని మేఘనను రూ. 30 లక్షలకు గుజరాత్ జెయింట్స్ కొనుగోలు చేసింది.
►భారత క్రికెటర్ కిరణ్ నవ్‌గిరేను రూ. 30 లక్షలకు యూపీ వారియర్జ్ దక్కించుకుంది.
►ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ గ్రేస్ హారిస్‌ను రూ. 75లక్షలకు యూపీ వారియర్జ్ కొనుగోలు చేసింది.
►భారత అండర్-19 క్రికెటర్ శ్వేతా సెహ్రావత్‌ను రూ. 40 లక్షలకు యూపీ వారియర్జ్ సొంతం చేసుకుంది.
►భారత ఆల్‌రౌండర్ స్నేహ్ రాణాను రూ.75 లక్షలకు గుజరాత్ జెయింట్స్ దక్కించుకుంది.
►దక్షిణాఫ్రికా స్టార్ ఆల్‌రౌండర్ మారిజాన్ కాప్‌ను రూ.1.5 కోట్లకు ఢిల్లీ క్యాపిటల్స్ సొంతం చేసుకుంది.
► భారత స్పిన్నర్ రాధా యాదవ్‌ను రూ.40 లక్షలకు ఢిల్లీ క్యాపిటల్స్ దక్కించుకుంది
►టీమిండియా యువ పేసర్ అంజలి శర్వణిను రూ.55 లక్షలకు యూపీ వారియర్జ్ సొంతం చేసుకుంది.
►భారత యువ వికెట్ కీపర్ రిచా ఘోష్‌కు భారీ ధర దక్కింది. రిచాను రూ. 1.9 కోట్లకు ఆర్సీబీ దక్కించుకుంది.
► భారత వికెట్ కీపర్ యాస్తిక భాటియను రూ.1.5 కోట్లకు ముంబై ఇండియన్స్ కొనుగోలు చేసింది.
► ఆస్ట్రేలియా ఆల్ రౌండర్ అన్నాబెల్లె సదర్లాండ్‌ను రూ. 70 లక్షలకు గుజరాత్ జెయింట్స్ దక్కించుకుంది.
► వెస్టిండీస్ మాజీ ఆల్‌రౌండర్ డియాండ్రా డాటిన్‌ను రూ.60లక్షలకు గుజరాత్ జెయింట్స్ సొంతం చేసుకుంది.
►భారత ఆల్‌రౌండర్ పూజా వస్త్రాకర్‌ను రూ. 1.9 కోట్లకు ముంబై ఇండియన్స్ కొనుగోలు చేసింది
► ఆస్ట్రేలియా కెప్టెన్ మెగ్ లానింగ్‌ను రూ.1.1కోట్లకు ఢిల్లీ క్యాపిటల్స్ కొనుగోలు చేసింది.
►భారత స్టార్ ఓపెనర్ షఫాలీ వర్మను రూ. 2 కోట్లకు ఢిల్లీ క్యాపిటల్స్ దక్కించుకుంది.
►భారత స్టార్ క్రికెటర్ జెమ్మిమా రోడ్రిగ్స్‌ను రూ. 2.2 కోట్లకు ఢిల్లీ క్యాపిటల్స్ కొనుగోలు చేసింది
►ఆస్ట్రేలియా స్టార్ ఓపెనర్ బెత్ మూనీని రూ.2 కోట్లకు గుజరాత్ జెయింట్స్ సొంతం చేసుకుంది.
►ఇంగ్లండ్ స్టార్ ఆల్‌రౌండర్ నాట్ స్కివర్‌ను రూ.3.2 కోట్ల భారీ ధరకు ముంబై దక్కించుకుంది.
► టీమిండియా పేసర్ రేణుకా సింగ్‌ను రూ.1.5 కోట్లకు ఆర్సీబీ సొంతం చేసుకుంది
► భారత స్టార్ ఆల్‌రౌండర్ దీప్తిశర్మను రూ.2.6 కోట్లకు యూపీ వారియర్జ్ కొనుగోలు చేసింది.
►మహిళల ప్రీమియర్ లీగ్ వేలంలో తొలి రౌండ్ ముగిసింది. తొలి సెట్‌లో స్మృతి మంధాన(రూ.3.4కోట్లు) భారీ దక్కించుకున్న ప్లేయర్‌గా నిలిచింది
►ఇంగ్లడ్ స్పిన్నర్ సోఫీ ఎకిల్‌స్టోన్‌ను రూ.1.8 కోట్లకు యూపీ వారియర్జ్ దక్కించుకోంది
►ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ ఎలీస్ పెర్రీని రూ.1.7 కోట్లకు ఆర్సీబీ సొంతం చేసుకుంది.
►ఆస్ట్రేలియా స్టార్ ఆల్‌రౌండర్ యాష్ గార్డెనర్‌ను రూ. 3.2 కోట్ల భారీ ధరకు గుజరాత్ జెయింట్స్ దక్కించుకుంది
► న్యూజిలాండ్ స్టార్ ఆల్‌రౌండర్ సోఫియా డివైన్‌ను రూ. 50 లక్షలకు ఆర్సీబీ కొనుగోలు చేసింది
►భారత కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్‌ను రూ. 1.8 కోట్లకు మంబై ఇండియన్స్ కొనుగోలు చేసింది.
స్మృతి మంధానకు భారీ ధర
మహిళల ప్రీమియర్ లీగ్ వేలంలో భారత స్టార్ ఓపెనర్ స్మృతి మంధాన భారీ ధరకు అమ్ముడుపోయింది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఫ్రాంచైజీ 3.4 కోట్లకు మంధానను సొంతం చేసుకుంది.
భారత క్రికెట్ నియంత్రణ మండలి ఆధ్వర్యంలో సరికొత్త చరిత్రకు శ్రీకారం జరుగనుంది. తొలిసారి నిర్మహించనున్న మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) టి20 టోర్నీ క్రికెటర్ల వేలం కార్యక్రమం సోమవారం మొదలైంది. మధ్యాహ్నం 2 గంటల 30 నిమిషాలకు మొదలైన ఈ కార్యక్రమాన్ని స్పోర్ట్స్ 18 చానెల్, జియో సినిమా యాప్‌లో ప్రత్యక్ష ప్రసారం చేస్తున్నారు.
మహిళా లీగ్ వేలం మహిళ మల్లిక సాగర్ నేతృత్వంలో జరగనుండటం విశేషం. మల్లిక 2021లో ప్రొ కబడ్డీ లీగ్ వేలం కార్యక్రమాన్ని నిర్వహించింది. మొత్తం 90 బెర్త్‌ల కోసం 409 మంది క్రికెటర్లు వేలం బరిలో ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment