![Gujarat Giants rope in Kim Garth as Deandra Dottin's replacement - Sakshi](/styles/webp/s3/article_images/2023/03/4/dottin.jpg.webp?itok=LW5cH6XT)
మహిళల ప్రీమియర్ లీగ్ తొలి సీజన్‌కు సర్వం సిద్దమైంది. గుజరాత్ జెయింట్స్, ముంబై ఇండియన్స్ మధ్య జరగనున్న తొలి మ్యాచ్‌తో ఈ లీగ్ షురూ కానుంది. ఈ మ్యాచ్ డివై పాటిల్ స్పోర్ట్స్ అకాడమీ వేదికగా శనివారం సాయంత్రం 7:30 గంటలకు ప్రారంభం కానుంది. అయితే తొలి మ్యాచ్‌కు ముందే గుజరాత్ జెయింట్స్‌కు ఊహించని షాక్ తగిలింది.
వెస్టిండీస్ మాజీ ఆల్‌రౌండర్ డియాండ్రా డాటిన్ గాయం కారణంగా టోర్నీ మొత్తానికి దూరమైంది. ముంబై వేదికగా జరిగిన వేలంలో డాటిన్‌ను రూ. 60 లక్షలకు గుజరాత్ జెయింట్స్ కొనుగొలు చేసింది. ఇక గుజరాత్ తమ జట్టులో డాటిన్ స్థానాన్ని ఆస్ట్రేలియా యువ ఆల్‌రౌండర్ కిమ్ గార్త్‌తో భర్తీ చేసింది. ఈ విషయాన్ని సోషల్‌మీడియా వేదికగా గుజరాత్ ప్రకటించింది.
కాగా ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిగిన వేలంలో కిమ్ గార్త్‌ను ఏ ఫ్రాంచైజీ కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపలేదు. అయితే ఇప్పుడు డాటిన్ దూరం కావడంతో ఈ క్యాష్‌రిచ్ లీగ్‌లో భాగమయ్యే ఛాన్స్ గార్త్‌కు దక్కింది. రూ.60 లక్షల కనీస ధరకు గార్త్‌తో గుజరాత్ ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలుస్తోంది. ఇక లీగ్‌లో గుజరాత్ జట్టు కెప్టెన్‌గా ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ బెత్ మూనీ వ్యవహరించనుంది.
చదవండి: IND vs AUS: ఆస్ట్రేలియాతో నాలుగో టెస్టు.. భరత్‌కు నో ఛాన్స్! కిషన్ అరంగేట్రం
Comments
Please login to add a commentAdd a comment