బంగ్లాదేశ్‌తో టీ20తో సిరీస్‌కు 15 మంది సభ్యులతో కూడిన భారత జట్టును బీసీసీఐ శనివారం రాత్రి ప్రకటించింది. ఈ జట్టులో కొన్ని అనూహ్య ఎంపికలు చోటు చేసుకున్నాయి. ఆంధ్ర ఆల్‌రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డికి జట్టులో స్ధానం లభించగా.. స్పీడ్ స్టార్ మయాంక్ యాదవ్‌కు తొలి సారి జాతీయ జట్టులో చోటు దక్కింది.
బంగ్లాతో టీ20 సిరీస్‌కు స్టార్ క్రికెటర్లు శుబ్‌మన్ గిల్, యశస్వీ జైశ్వాల్, రిషబ్ పంత్‌లు దూరమయ్యారు. వర్క్ లోడ్ కారణంగా వీరిముగ్గురికి సెలక్టర్లు విశ్రాంతి ఇచ్చారు. వికెట్ కీపర్‌గా సంజూ శాంసన్ ఛాన్స్ కొట్టేశాడు.
మిస్టరీ స్పిన్నర్ రీఎంట్రీ
ఇక ఈ సిరీస్‌కు మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తికి సెలక్టర్లు పిలుపు నిచ్చారు. అతడికి దాదాపు మూడేళ్ల తర్వాత భారత జట్టులో చోటుదక్కింది. చక్రవర్తి చివరగా టీమిండియా తరపున 2021 టీ20 ప్రపంచకప్‌లో ఆడాడు. అయితే ఐపీఎల్-2024లో అద్భుతమైన ప్రదర్శన కనబరచడంతో సెలక్టర్లు అతడికి మళ్లీ పిలునివ్వాలని నిర్ణయించుకున్నారు.
అయితే అతడి మళ్లీ భారత జట్టులోకి పునరాగమనం చేయడంలో హెడ్‌కోచ్ గంభీర్‌ది కీలక పాత్ర అని చెప్పవచ్చు. ఈ ఏడాది సీజన్‌లో కేకేఆర్ మెంటార్‌గా పనిచేసిన గంభీర్‌ను.. చక్రవర్తి తన ప్రదర్శనలతో ఆకట్టుకున్నాడు.
ఈ క్రమంలోనే సెలక్టర్లకు గౌతీ అతడిని ఎంపిక చేయాలని సూచించినట్లు తెలుస్తోంది. చక్రవర్తి టీమిండియా తరపున ఇప్పటివరకు 6 మ్యాచ్‌లు ఆడి రెండు వికెట్లు పడగొట్టాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో చెప్పుకోదగ్గ ప్రదర్శన చేయనప్పటకి.. దేశీవాళీ క్రికెట్‌లో మాత్రం వరుణ్‌కు మంచి రికార్డు ఉంది. 87 టీ20లు ఆడి 98 వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు.
బంగ్లాతో టీ20లకు భారత జట్టు: సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), అభిషేక్ శర్మ, సంజు శాంసన్ (వికెట్ కీపర్), రింకు సింగ్, హార్దిక్ పాండ్యా, రియాన్ పరాగ్, నితీష్ కుమార్ రెడ్డి, శివమ్ దూబే, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, వరుణ్ చక్రవర్తి, జితేష్ శర్మ (వికెట్ కీపర్), అర్ష్దీప్ సింగ్, హర్షిత్ రానా, మయాంక్ యాదవ్
Comments
Please login to add a commentAdd a comment