
PC: IPL.com
ఐపీఎల్-2023లో కేకేఆర్ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి తన అద్భుత ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. ఈ మెగా ఈవెంట్‌లో భాగంగా సోమవారం పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో మూడు వికెట్లతో వరుణ్ చక్రవర్తి చెలరేగాడు. ఈ మ్యాచ్‌లో తన నాలుగు ఓవర్ల కోటాలో 26 పరుగులిచ్చి మూడు కీలక వికెట్లు సాధించాడు.
ఇక ఈ ఏడాది సీజన్‌లో ఇప్పటివరకు 11 మ్యాచ్‌లు ఆడిన వరుణ్.. 17 వికెట్లు పడగొట్టాడు. ఇక ఈ క్యాష్ రిచ్ లీగ్‌లో అద్భుత ప్రదర్శన కనబరుస్తున్న వరుణ్ చక్రవర్తిపై టీమిండియా మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ ప్రశంసల వర్షం కురిపించాడు. వరుణ్ చక్రవర్తి ప్రస్తుతం అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడని, తిరిగి భారత జట్టులోకి ఎంట్రీ ఇస్తాడని భజ్జీ కొనియాడాడు.
"నేను వరుణ్‌తో కలిసి కేకేఆర్ తరపున ఆడినప్పుడు అతడు తీవ్రమైన మోకాలి నొప్పితో బాధపడుతున్నాడు. ఆసమయంలో అతడు ఇంజెక్షన్లు తీసుకుంటూ, ఐస్ ప్యాక్‌లు వేసుకుంటూ టోర్నీ మొత్తం కొనసాగాడు. అయినప్పటికీ అతడు ఆ సీజన్‌లో అద్భుతంగా బౌలింగ్ చేశాడు. వరుణ్ టీమిండియాకు ఎంపికైనప్పుడు కూడా మోకాలి నొప్పితో బాధపడుతున్నాడు.
ఓ సందర్భంలో అతడితో నేను మాట్లాడినప్పుడు బరువు తగ్గించుకోమని సలహా ఇచ్చాను. ఎందుకంటే బరువు కారణంగా అతని మోకాలిపై చాలా ఒత్తిడి పడుతుంది. అతడు బరువు తగ్గాడు. ఇప్పుడు ఎటువంటి సమస్య లేకుండా బౌలింగ్‌తో పాటు ఫీల్డింగ్ కూడా అద్భుతంగా చేస్తున్నాడు. కాబట్టి వరుణ్ కచ్చితంగా టీమిండియాలోకి రీ ఎంట్రీ ఇస్తాడు" అని స్టా్‌ర్ స్పోర్ట్స్ షోలో హర్భజన్ సింగ్ పేర్కొన్నాడు.
చదవండి: IPL 2023: ఆర్సీబీతో ముంబై కీలకపోరు.. తిలక్ వర్మ బ్యాక్! అతడు కూడా