ఐపీఎల్-2023లో కోల్‌కతా నైట్‌రైడర్స్ మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి ప్రత్యర్ధి బ్యాటర్లకు చుక్కలు చూపిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఆదివారం చెపాక్ వేదికగా చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో వరుణ్ చక్రవర్తి మరో సారి తన స్పిన్ మయాజాలన్ని ప్రదర్శించాడు. తన 4 ఓవర్ల కోటాలో 36 పరుగులిచ్చి 2 కీలక వికెట్లు పడగొట్టాడు.
అతడితో పాటు సునీల్ నరైన్ కూడా కేవలం 15 పరుగులు మాత్రమే ఇచ్చి రెండు వికెట్లు సాధించాడు. ఈ ఏడాది సీజన్‌లో ఇప్పటివరకు 13 మ్యాచ్‌లు ఆడిన వరుణ్.. 19 వికెట్లు తీసి అత్యధిక వికెట్లు తీసిన జాబితాలో ఐదో స్థానంలో ఉన్నాడు. ఇక అద్భుతంగా రాణిస్తున్న వరుణ్ చక్రవర్తిపై సీఎస్‌కే హెడ్ కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ ఆసక్తికర వాఖ్యలు చేశాడు. వరుణ్ చక్రవర్తి నెట్ బౌలర్‌గా ఉన్నప్పుడు తీవ్ర ఇబ్బంది పెట్టేవాడని ఫ్లెమింగ్ అన్నాడు.
సీసీఎస్‌కే, కేకేఆర్ మ్యాచ్ అనంతరం ఫ్లెమింగ్ మాట్లాడుతూ.. "వరుణ్‌ను వదులుకున్నందుకు మేము ఇప్పటికీ బాధపడుతున్నాం. అతడు నెట్స్ లో మమ్మల్ని టార్చర్ పెట్టేవాడు. అతడొక అద్భుతమైన మిస్టరీ స్పిన్నర్. నెట్స్‌లో అతడి బౌలింగ్ చూసి మేము చాలా ఆశ్చర్యపోయాం. అయితే దురదృష్టవశాత్తూ వేలంలో అతడిని మేము సొంతం చేసుకోలేకపోయాం.
గతేడాది వేలంలో కూడా అతడిని దక్కించుకోవడానికి ప్రయత్నించాం. కానీ మళ్లీ అతడిని కేకేఆర్ భారీ ధరకు సొంతం చేసుకుంది. చెపాక్ వంటి స్పిన్ పిచ్‌లపై చక్రవర్తి మరింత అద్భుతంగా రాణించగలడు. నేటి మ్యాచ్‌లో కూడా చక్రవర్తి చాలా బాగా బౌలింగ్ చేశాడు" అతడు పేర్కొన్నాడు.
చదవండి: అతడిని భారత జట్టులోకి తీసుకోండి.. సరిగ్గా వాడుకుంటే అద్భుతాలు సృష్టిస్తాడు
Comments
Please login to add a commentAdd a comment