Varun Chakravarthy Dodgy Knees Became Biggest Head Ache For Team India: త్వరలో ప్రారంభంకానున్న టీ20 ప్రపంచకప్‌కు ముందు టీమిండియాకు ఓ షాకింగ్ వార్త పెద్ద తలనొప్పిగా మారింది. యువ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి మెగా టోర్నీలో ఆడటం అనుమానంగా ఉందని బీసీసీఐ వర్గాలు పేర్కొన్నాయి. ప్రస్తుతం ఐపీఎల్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్ తరఫున ఆడుతున్న వరుణ్..మోకాళ్ల నొప్పులతో సతమతమవుతున్నాడు. పెయిన్ కిల్లర్ లేకుండా అతను బరిలోకి దిగే పరిస్థితి లేదు. దీంతో పొట్టి ప్రపంచకప్‌కు అతను అందుబాటులో ఉంటాడా లేదా అన్నది అనుమానంగా మారింది.
ఈ నేపథ్యంలో వరుణ్ స్థానంలో చహల్‌ను జట్టులోకి తీసుకునే అంశం బీసీసీఐ పరిశీలనలో ఉన్నట్లు సమాచారం. అక్టోబరు 10 వరకు తుది జట్లలో మార్పులు చేర్పులు చేసుకునేందుకు అవకాశం ఉన్న విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే, వరుణ్.. ప్రస్తుత ఐపీఎల్‌లో కేకేఆర్ తరఫున 13 మ్యాచ్‌ల్లో 15 వికెట్లతో సూపర్ ఫామ్‌లో కొనసాగుతున్నాడు. 30 ఏళ్ల ఈ మిస్టరీ స్పిన్నర్ టీమిండియా తరఫున 3 టీ20ల్లో 2 వికెట్లు, 27 ఐపీఎల్ మ్యాచ్‌ల్లో 33 వికెట్లు పడగొట్టాడు.
చదవండి: T20 World Cup 2021: ఈ ఐదు తొలిసారిగా.. సరికొత్తగా.. ఆసక్తికర విశేషాలు
Comments
Please login to add a commentAdd a comment