టీమిండియా మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి(Varun Chakravarthy) తన రీఎంట్రీలో సత్తాచాటుతున్నాడు. దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్‌లో తన స్పిన్ మాయాజాలంతో బెంబేలెత్తించిన వరుణ్.. ఇప్పుడు ఇంగ్లండ్ సిరీస్‌లోనూ అదే తీరును కనబరుస్తున్నాడు. కోల్‌కతా వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన తొలి టీ20లో చక్రవర్తి మూడు వికెట్లు పడగొట్టాడు.
హ్యారీ బ్రూక్, లివింగ్ స్టోన్, బట్లర్ వంటి కీలక వికెట్లు పడగొట్టి ఇంగ్లండ్‌ను దెబ్బ తీశాడు. ఈ క్రమంలో వరుణ్ చక్రవర్తిని ఉద్దేశించి భారత మాజీ వికెట్ కీపర్ దినేశ్ కార్తీక్(Dinesh Karthik) కీలక వ్యాఖ్యలు చేశాడు. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీకి వరుణ్ చక్రవర్తిని ఎందుకు ఎంపిక చేయలేదని భారత సెలక్టర్లను కార్తీక్ ప్రశ్నించాడు.
వరుణ్ ప్రస్తుతం అద్బుతమైన ఫామ్‌లో ఉన్నాడని. అతడికి ఛాంపియన్స్ ట్రోఫీ జట్టులో చోటు ఇచ్చిండాల్సందని దినేష్ అభిప్రాయపడ్డాడు. కాగా చక్రవర్తికి 15 మంది సభ్యల ప్రధాన జట్టులో చోటు దక్కలేదు. అతడిని ట్రావిలింగ్ రిజర్వ్‌గా బీసీసీఐ సెలక్షన్ కమిటీ ఎంపిక చేసింది.
కాగా సరిగ్గా రెండు నెలల క్రితం వరుణ్ చక్రవర్తిని ఉద్దేశించి కార్తీక్ ఓ ట్వీట్ చేశాడు. "ఛాంపియన్స్ ట్రోఫీకి వరుణ్‌ను ఎంపిక చేయకపోతే అది భారత సెలక్టర్లు చేసిన ఘోర తప్పిదం అవుతుందని "ఎక్స్‌లో డీకే రాసుకొచ్చాడు. ఇప్పడు అదే విషయాన్ని మరోసారి హైలెట్ చేస్తూ చక్రవర్తిని ఛాంపియన్స్ ట్రోఫీ జట్టులోకి ఇప్పుడైనా తీసుకుంటారా? అని ట్వీట్ చేశాడు.
నలుగురు స్పిన్నర్లతో..
ఛాంపియన్స్ ట్రోఫీ కోసం బీసీసీఐ సెలక్షన్ కమిటీ నలుగురు స్పిన్నర్లను ఎంపిక చేసింది. గాయం నుంచి కోలుకున్న కుల్దీప్ యాదవ్ తిరిగి వచ్చాడు. రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్ వంటి అనుభవజ్ఞులైన మణికట్టు స్పిన్నర్లకు చోటు దక్కింది.
ఈ క్రమంలోనే సెలక్టర్లు చక్రవర్తికి ప్రధాన జట్టులో చోటు ఇవ్వలేదు. కానీ చక్రవర్తి అంతర్జాతీయ క్రికెట్‌తో పాటు దేశవాళీ క్రికెట్‌లో కూడా అద్భుత ప్రదర్శన కనబరుస్తున్నాడు. విజయ్ హజారే ట్రోఫీలో చక్రవర్తి అదరగొట్టాడు. 2024-25 సీజన్‌లో వరుణ్ తమిళనాడు తరపున కేవలం ఆరు మ్యాచ్‌ల్లోనే నే 18 వికెట్లు పడగొట్టాడు.
తొలి టీ20లో భారత్ ఘన విజయం
ఇక ఈడెన్ గార్డెన్స్ వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో 7 వికెట్ల తేడాతో భారత్ విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ నిర్ణీత 20 ఓవర్లలో 132 పరుగులకు ఆలౌటైంది. కెప్టెన్ జోస్ బట్లర్(44 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్స్‌లతో 68) ఒక్కడే ఒంటరి పోరాటం చేశాడు. భారత బౌలర్లలో వరుణ్ చక్రవర్తి మూడు వికెట్లు పడగొట్టగా.. అక్షర్ పటేల్, అర్ష్‌దీప్ సింగ్, హార్దిక్ పాండ్యా తలా రెండు వికెట్లు తీశారు.
అనంతరం స్వల్ప లక్ష్యాన్ని టీమిండియా కేవలం 3 వికెట్లు మాత్రమే కోల్పోయి 12.5 ఓవర్లలోనే చేధించింది. భారత యువ ఓపెనర్ అభిషేక్ శర్మ విధ్వంసం సృష్టించాడు. కేవలం 34 బంతుల్లో 5 ఫోర్లు,8 సిక్స్‌లతో 79 పరుగులు చేసి శర్మ టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఇక ఇరు జట్ల మధ్య రెండో టీ20 జనవరి 25న చెన్నై వేదికగా జరగనుంది.
ఛాంపియన్స్ ట్రోఫీకి భారత జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభమన్ గిల్ (వైస్ కెప్టెన్), విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కెఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీ, అర్ష్‌దీప్ సింగ్, యశస్వి జైస్వాల్, రిషబ్ పంత్, రవీంద్ర జడేజా.
ట్రావెలింగ్ రిజర్వ్స్: వరుణ్ చక్రవర్తి, ఆవేశ్ ఖాన్, నితీశ్ కుమార్ రెడ్డి
చదవండి: అతడొక సూపర్‌స్టార్.. మా ఓటమికి కారణం అదే: బట్లర్
Comments
Please login to add a commentAdd a comment