టీమిండియా మణికట్టు స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి దాదాపు మూడేళ్ల తర్వాత భారత జెర్సీలో కన్పించాడు. గ్వాలియర్ వేదికగా బంగ్లాదేశ్‌తో జరుగుతున్న తొలి టీ20లో భారత తుది జట్టులో వరుణ్ చోటు దక్కించుకున్నాడు.
86 మ్యాచ్‌లు గ్యాప్ తర్వాత మళ్లీ అతడు భారత జట్టులోకి రీఎంట్రీ ఇచ్చాడు. అయితే చక్రవర్తి ప్లేయింగ్ ఎలెవన్‌లో చోటిచ్చిన భారత జట్టు మెనెజ్‌మెంట్ మరో స్పిన్నర్ రవి బిష్ణోయ్‌ను మాత్రం బెంచ్‌కే పరిమితం చేసింది.
గంభీర్ ఎఫెక్ట్..
కాగా వరుణ్ చక్రవర్తి పునరాగమనం వెనక గంభీర్ మార్క్ ఉంది. చక్రవర్తికి గంభీర్‌కు మధ్య మంచి అనుబంధం ఉంది. గత సీజన్‌లో కేకేఆర్ మెంటార్‌గా గంభీర్ పనిచేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో చక్రవర్తి తన ప్రదర్శనతో గౌతీని ఆకట్టుకున్నాడు.
అంతేకాకుండా ఈ తమిళనాడు స్పిన్నర్ రెండు ఐపీఎల్ సీజన్లలో అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. ఐపీఎల్-2023, 24 సీజన్‌లలో మొత్తంగా వరుణ్ 41 వికెట్లు పడగొట్టాడు. ఈ క్రమంలోనే అతడిని గంభీర్ రికమెండ్ చేసినట్లు తెలుస్తోంది.
పాపం బిష్ణోయ్
బిష్ణోయ్ గత కొన్నాళ్లగా భారత టీ20 జట్టులో రెగ్యూలర్ సభ్యునిగా కొనసాగుతున్నాడు. ఇప్పటికే తన సత్తా ఏంటో బిష్ణోయ్ నిరూపించుకున్నాడు. గతంలో నెం1 టీ20 బౌలర్‌గా రవి నిలిచాడు. అయితే టీ20 వరల్డ్‌కప్-2024కు మాత్రం అతడిని సెలక్ట్ చేయలేదు.
ఆ తర్వాత ఈ లెగ్ స్పిన్నర్‌ను జింబాబ్వే, శ్రీలంక పర్యటనలకు ఎంపిక చేశారు. ఈ రెండు పర్యటనలలోనూ బిష్ణోయ్ సత్తాచాటాడు. జింబాబ్వేపై 6 వికెట్లు పడగొట్టిన బిష్ణోయ్..శ్రీలంకపై 6 కూడా 6 వికెట్లు సాధించాడు. అయినప్పటకి బంగ్లాతో తొలి టీ20కు బిష్ణోయ్‌ను పక్కటన పెట్టడాన్ని అభిమానులు తప్పుబడుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment