
సినిమాకు క్రికెట్‌కు ఏదో అవినాభావ సంబంధం ఉంది. ఈ రెండు రంగాలకు ఓ తెలీని కనెక్షన్ ఉంటుంది. సినీ సెలబ్రిటీలు తమకు నచ్చిన క్రికెటర్ ఆటతీరును చూసేందుకు స్టేడియానికి వెళ్తారు. అలాగే క్రికెటర్లు తమ అభిమాన నటులను కలవాలని తాపత్రయపడతారు. ఇదిగో అలానే క్రికెటర్ వరుణ్ చక్రవర్తి కూడా తన అభిమాన హీరో విజయ్‌ను ఎప్పటినుంచో కలవాలనుకున్నారు. చివరికి కాలం కలిసొచ్చింది. దళపతి విజయ్ ఆఫీసుకు వెళ్లి మరీ వరుణ్ హీరోను కలిసి ముచ్చటించారు. ఈ సందర్భంగా దిగిన ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. (చదవండి: హీరో విజయ్ అభిమానుల అత్యుత్సాహం!)
ఒకే ఫ్రేములో కనిపించిన ఇద్దరు సెలబ్రిటీలను చూసేందుకు వారి అభిమానులకు రెండు కళ్లు చాలడం లేదు. విజయ్ నటిస్తోన్న మాస్టర్ చిత్రం కోసం ఆయన అభిమానులతో పాటు వరుణ్ కూడా అత్యంత ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కాగా విజయ్ కూడా క్రికెట్‌కు వీరాభిమాని. 2008 ఐపీఎల్ లీగ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ టీమ్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్నారు. మాస్టర్ సినిమా విషయానికి వస్తే అందులో విజయ్ బాధ్యత లేని కాలేజీ ప్రొఫెసర్‌గా కనిపించనున్నారు. మాళవిక మోహనన్ ఆయనకు జోడీగా నటించనున్నారు. ఈ సినిమా తమిళ, తెలుగు, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో రిలీజ్ కానుంది. ఇక క్రికెటర్ వరుణ్ చక్రవర్తి విషయానికొస్తే.. ఈ ఏడాది ఐపీఎల్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్ టీమ్‌లో ఆడి మంచి పర్ఫామెన్స్‌తో ఆకట్టుకున్నారు. దీంతో ఆస్ట్రేలియా పర్యటనకు అతడి పేరును ఖరారు చేశారు. కానీ భుజం నొప్పితో బాధపడుతున్నందు వల్ల ఈ స్పిన్నర్‌ను టీ 20 సిరీస్‌కు దూరమయ్యారు. (చదవండి: ఆసీస్ టూర్‌కు వరుణ్ దూరం! సెలక్టర్లపై విమర్శలు)
Ulla vandha powera-di,
— Varun Chakaravarthy (@chakaravarthy29) November 17, 2020
Anna yaaru?…
THALAPATHY.. #vaathicoming#vaathiraid #master #ThalapathyVijay 🤩😘 pic.twitter.com/TFoPqxn65J
Comments
Please login to add a commentAdd a comment