పోర్ట్ ఎలిజబెత్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో టీ20లో 3 వికెట్ల తేడాతో టీమిండియా ఓటమి పాలైంది. 125 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని 19 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి ఆతిథ్య ప్రోటీస్ చేధించింది. ఓ దశలో ఆఫ్ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి (4–0–17–5) మాయాజాలంతో భారత్ గెలిచేలా కన్పించినప్పటకి.. సఫారీ బ్యాటర్ ట్రిస్టన్ స్టబ్స్ (47 నాటౌట్) విరోచిత పోరాటంతో తన జట్టును ఓటమి నుంచి గట్టెక్కించాడు.
దీంతో నాలుగు మ్యాచ్‌ల సిరీస్‌ను 1-1తో సౌతాఫ్రికా సమం చేసింది. ఇక ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి కేవలం 124 పరుగులు చేసింది. టీమిండియా బ్యాటర్లలో హార్దిక్ పాండ్యా(39 నాటౌట్) ఫైటింగ్ నాక్ ఆడాడు. అతడితో పాటు అక్షర్ పటేల్(27), తిలక్ వర్మ(20) పరుగులతో పర్వాలేదన్పించారు.
దక్షిణాఫ్రికా బౌలర్లలో జాన్సెన్, కోయిట్జీ, పీటర్, సీమీలేన్ తలా వికెట్ సాధించారు. ఇక ఈ ఓటమిపై మ్యాచ్ అనంతరం టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ స్పందించాడు. ఓటమి పాలైనప్పటకి వరుణ్ చక్రవర్తి అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడని సూర్య కోనియాడు.
చాలా గర్వంగా ఉంది: సూర్యకుమార్
"ఎప్పుడైనా సరే ఎంత లక్ష్యం నమోదు చేసినా కానీ డిఫెండ్ చేసుకునేందుకు ప్రయత్నించాలి. సెకెండ్ ఇన్నింగ్స్ ఆరంభానికి ముందు మా కుర్రాళ్లకు ఇదే విషయం చెప్పాను. ఫలితాలు కోసం ఆలోచించకండి, ఆఖరి వరకు పోరాడాదం అని చెప్పాను. వాస్తవానికి టీ20 గేమ్‌లో 125 లేదా 140 పరుగుల టార్గెట్‌ను కాపాడుకోవడం అంత సులభం కాదు.
కానీ మా బౌలర్లు అద్బుతమైన పోరాట పటిమ కనబరిచారు. వారి పోరాట పటిమ చూసి గర్వపడుతున్నా. ముఖ్యంగా వరుణ్ చక్రవర్తి బంతితో మ్యాజిక్ చేశాడు. 125 పరుగుల లోస్కోరింగ్ మ్యాచ్‌లో టార్గెట్‌ను డిఫెండ్ క్రమంలో ఒక్క బౌలర్ 5 వికెట్లు సాధించడం చాలా గొప్ప విషయం.
అతడు ఈ రోజు కోసమే ఎప్పటినుంచో ఎదురుచేస్తున్నాడు. అందుకోసం చాలా కష్టపడ్డాడు. ఈ రోజు అతడి కష్టానికి తగ్గ ఫలితం దక్కింది. చాలా సంతోషంగా ఉంది. ఇక ఈ సిరీస్‌లో ఇంకా రెండు మ్యాచ్‌లు మిగిలి ఉన్నాయి. జోహాన్స్‌బర్గ్‌లో జరగనున్న మూడో టీ20లో ఈ ఓటమికి బదులు తీర్చుకుంటామని" పోస్ట్ మ్యాచ్ ప్రేజేంటేషన్‌లో సూర్య పేర్కొన్నాడు.
చదవండి: IND vs SA: విజయాన్ని వదిలేశారు
Comments
Please login to add a commentAdd a comment