
Courtesy: IPL Twitter
ఐపీఎల్ 2022లో భాగంగా ఆర్‌సీబీతో మ్యాచ్‌లో కేకేఆర్ టెయిలెండర్లు ఉమేశ్ యాదవ్, వరుణ్ చక్రవర్తిలు సరికొత రికార్డు నెలకొల్పారు. ఈ మ్యాచ్‌లో ప్రధాన బ్యాట్స్‌మెన్ విఫలమైన వేళ ఈ ఇద్దరు కలిసి ఆఖరి వికెట్‌కు 27 పరుగులు జత చేశారు. విశేషమేమిటంటే.. కేకేఆర్ ఇన్నింగ్స్‌లో ఇదే అత్యధిక భాగస్వామ్యం కావడం విశేషం. ఉమేశ్ యాదవ్(18), వరుణ్ చక్రవర్తి(10 నాటౌట్) పరుగులు చేశారు. వీరిద్దరు ఆడడంతో కేకేఆర్ 128 పరుగుల గౌరవ ప్రదమైన స్కోరు సాధించింది.
కాగా ఐపీఎల్‌లో ఒక జట్టు తరపున 10,11 బ్యాట్స్‌మెన్ అత్యధిక పరుగుల భాగస్వామ్యం నమోదు చేయడం ఇది ఐదోసారి మాత్రమే. ఇక కేకేఆర్ బ్యాటర్స్‌లో రసెల్ 25 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. అయితే ఉమేశ్ యాదవ్- వరుణ్ చక్రవర్తిలను చూసి ప్రధాన బ్యాటర్స్ బ్యాటింగ్ ఆడడం నేర్చుకోవాలని అభిమానులు కామెంట్స్ చేశారు.
చదవండి: Harshal Patel: ఐపీఎల్ చరిత్రలో రెండో బౌలర్‌గా హర్షల్ పటేల్
IPL 2022: క్రికెట్ చరిత్రలోనే అత్యంత చెత్త రివ్యూగా మిగిలిపోనుంది