
PC: IPL.com
ఐపీఎల్-2023లో భాగంగా చిన్నస్వామి స్టేడియం వేదికగా ఆర్సీబీతో జరిగిన మ్యాచ్‌లో కేకేఆర్ యువ స్పిన్నర్ సుయాష్ శర్మ అదరగొట్టాడు. ఇంపాక్ట్ ప్లేయర్‌గా బరిలోకి దిగిన సుయాష్ రెండు కీలక వికెట్లు పడగొట్టి.. కేకేఆర్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. తన నాలుగు ఓవర్ల కోటాలో 30 పరుగులిచ్చి రెండు వికెట్లు సాధించాడు.
ఇక ఈ మ్యాచ్ అనంతరం19 ఏళ్ల సుయాష్ శర్మపై మరో కేకేఆర్ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి ప్రశంసల వర్షం కురిపించాడు. సుయాష్ భవిష్యత్తులో కచ్చితంగా భారత జట్టుకు ఆడుతాడని చక్రవర్తి కొనియాడాడు. కాగా ఈ మ్యాచ్‌లో చక్రవర్తి కూడా అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. వరుణ్ తన నాలుగు ఓవర్ల కోటాలో మూడు వికెట్లు పడగొట్టి 27 పరుగులిచ్చాడు.
"సుయాష్ శర్మ అద్భుతమైన లెగ్ స్పిన్నర్. అతడు జట్టులోకి రావడంతో మా బౌలింగ్ విభాగం మరింత బలపడింది. అదే విధంగా అతడు భవిష్యత్తులో కచ్చితంగా భారత్ తరపున ఆడుతాడు. అతడు దేశీవాళీ క్రికెట్‌లో ఆడి తన టాలెంట్‌ను మరింత మెరుగుపరుచుకోవాలని" మ్యాచ్ అనంతరం ఏర్పాటు చేసిన విలేకురల సమావేశంలో వరుణ్ చక్రవర్తి పేర్కొన్నాడు. కాగా ఈ మ్యాచ్‌లో కేకేఆర్ 21 పరుగుల తేడాతో విజయం సాధించింది.
చదవండి: IPL 2023 RCB Vs KKR: కోహ్లి కాలికి దండం పెట్టిన రింకూ సింగ్.. ఫోటోలు వైరల్