Suyash Sharma
-
KKR Vs SRH: శభాష్ సుయాష్.. సన్‌రైజర్స్ నుంచి మ్యాచ్‌ను లాగేసుకున్నాడు..!
ఐపీఎల్ 2024 సీజన్లో ప్రారంభమైన రెండో రోజు అదిరిపోయే మ్యాచ్‌ను అందించింది. ఈడెన్ గార్డెన్స్ వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్, కోల్‌కతా నైట్‌రైడర్స్ మధ్య నిన్న (రాత్రి 7:30 గంటలకు) జరిగిన మ్యాచ్ ఆఖరి బంతి వరకు నరాలు తెగే ఉత్కంఠ నడుమ సాగింది. భారీ లక్ష్య ఛేదనలో ఆఖరి ఓవర్లో 13 పరుగులు చేయాల్సి ఉండగా.. హెన్రిచ్ క్లాసెన్ తొలి బంతికే సిక్సర్ బాది సన్‌రైజర్స్ శిబిరంలో గెలుపుపై ధీమా పెంచగా.. కేకేఆర్ ఆటగాళ్లు హర్షిత్ రాణా, సుయాష్ శర్మ ఆ ఆనందాన్ని వారికి ఎంతో సేపు నిలబడనీయలేదు. చివరి ఓవర్ బౌలింగ్ చేసిన రాణా వైవిధ్యమైన బంతులు సంధించి సన్‌రైజర్స్ గెలుపుకు అడ్డుకోగా.. సుయాష్ శర్మ కీలక దశలో (2 బంతుల్లో 5 పరుగులు) మెరుపు క్యాచ్ (క్లాసెన్) పట్టి ఆరెంజ్ ఆర్మీ చేతుల్లో నుంచి మ్యాచ్ లాగేసుకున్నాడు. ONE OF THE GREATEST CATCHES IN IPL HISTORY...!!! - Take a bow, Suyash Sharma. 🫡pic.twitter.com/CAq18gb8EO — Johns. (@CricCrazyJohns) March 23, 2024 సుయాష్ ఆ క్యాచ్ మిస్ చేసి ఉంటే బౌండరీ లభించి సన్‌రైజర్స్ సునాయాసంగా మ్యాచ్ గెలిచేది. ఒకవేళ ఆ క్యాచ్ డ్రాప్ అయ్యి, పరుగు రాకపోయినా అప్పటికే శివాలెత్తి ఉన్న క్లాసెన్ ఆఖరి బంతికి సిక్సర్ బాది సన్‌రైజర్స్‌ను గెలిపించేవాడు. సుయాష్ అందుకున్న ఈ అద్భుతమైన రన్నింగ్ క్యాచ్‌కు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట హల్చల్ చేస్తుంది. క్యాచెస్ విన్ మ్యాచెస్ అని ఇందుకే అంటారంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. కాగా, ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన కేకేఆర్.. సాల్ట్ (54), రసెల్ (64) అర్దసెంచరీలతో రాణించడంతో నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 208 పరుగులు చేసింది. ఆఖర్లో రసెల్ 7 సిక్సర్లు, 3 బౌండరీలతో విరుచుకుపడి కేకేఆర్ 200 పరుగుల మార్కును దాటేందుకు దోహదపడ్డాడు. చివర్లో రమన్‌దీప్ సింగ్ (35; ఫోర్, 4 సిక్సర్లు), రింకూ సింగ్ (23; 3 ఫోర్లు) కూడా మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడారు. సన్‌రైజర్స్ బౌలర్లలో నటరాజన్ 3 వికెట్లు పడగొట్టగా.. మయాంక్ మార్కండే 2, కమిన్స్ ఓ వికెట్ దక్కించుకున్నారు. అనంతరం 209 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన సన్‌రైజర్స్.. ఆదిలో తడబడినప్పటికీ గెలుపు అంచుల వరకు వచ్చి ఓటమిపాలైంది. క్లాసెన్ మెరుపు ఇన్నింగ్స్‌తో (29 బంతుల్లో 63; 8 సిక్సర్లు) మ్యాచ్ రూపురేఖల్నే మార్చేశాడు. అయితే గెలుపుకు 5 పరుగులు కావాల్సిన తరుణంలో అతడు ఔట్ కావడంతో మ్యాచ్ ఒక్కసారిగా కేకేఆర్పైపు మలుపు తిరిగింది. ఆ జట్టు నిర్ణీత ఓవర్లు పూర్తయ్యేసరికి 7 వికెట్ల నష్టానికి 204 పరుగులు చేసి లక్ష్యానికి 5 పరుగుల దూరంలో నిలిచిపోయింది. సన్‌రైజర్స్ ఓపెనర్లు మయాంక్ అగర్వాల్ (32), అభిషేక్ శర్మ (32) ఓ మోస్తరు స్కోర్లతో శుభారంభాన్ని అందించగా.. వన్‌డౌన్ బ్యాటర్ రాహుల్ త్రిపాఠి జిడ్డు బ్యాటింగ్‌తో (20 బంతుల్లో 20) సన్‌రైజర్స్ ఓటమికి పరోక్ష కారకుడయ్యాడు. సన్‌రైజర్స్ ఈ మ్యాచ్ చేజార్చుకున్నప్పటికీ.. క్లాసెన్ తమ విధ్వంసకర ఇన్నింగ్స్‌తో అభిమానుల మనసుల్ని దోచుకున్నాడు. -
SMAT 2023: అరంగేట్రంలోనే ఐదు వికెట్లతో చెలరేగిన కేకేఆర్ బౌలర్
కోల్‌కతా నైట్‌రైడర్స్ బౌలర్ సుయాశ్ శర్మ.. సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీ 2023లో ఢిల్లీ తరఫున తన అరంగేట్రం మ్యాచ్‌లోనే చెలరేగిపోయాడు. మధ్యప్రదేశ్‌తో ఇవాళ (అక్టోబర్ 17) జరుగుతున్న మ్యాచ్‌లో నాలుగు ఓవర్లు వేసిన సుయాశ్.. కేవలం 13 పరుగులు మాత్రమే ఇచ్చి ఐదు వికెట్లు పడగొట్టాడు. ఈ మ్యాచ్‌లో సుయాశ్తో పాటు ఇషాంత్ శర్మ (4-0-29-2), హర్షిత్ రాణా (4-0-22-2) కూడా రాణించడంతో ఢిల్లీ టీమ్ మధ్యప్రదేశ్‌ను 115 పరుగులకు (9 వికెట్ల నష్టానికి) కట్టడి చేసింది. ఈ మ్యాచ్‌లో మధ్యప్రదేశ్ టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకోగా.. ఒక్కరు కూడా పెద్ద స్కోర్లు చేయలేకపోయారు. సుయాశ్.. మధ్యప్రదేశ్ పతనాన్ని శాసించాడు. గుర్తింపు కలిగిన ఆటగాళ్లు వెంకటేశ్ అయ్యర్ (2), రజత్ పాటిదార్ (7) నిరాశపర్చగా.. శుభమ్ శర్మ (10), సాగర్ సోలంకి (13), రాకేశ్ ఠాకూర్ (15), రాహుల్ బాథమ్ (32), అర్షద్ ఖాన్ (12) రెండంకెల స్కోర్లు చేశారు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ విజయం దిశగా సాగుతుంది. ఆ జట్టు 14 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 76 పరుగులు చేసింది. ప్రియాంశ్ ఆర్య (22), అనూజ్ రావత్ (23), యశ్ ధుల్ (0) ఔట్ కాగా.. అయుశ్ బదోని (20), హిమ్మత్ సింగ్ (9) క్రీజ్‌లో ఉన్నారు. కాగా, ఢిల్లీ బౌలర్ సుయాశ్ శర్మ ఈ ఏడాది ఐపీఎల్‌తో క్యాష్ రిచ్ లీగ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ సీజన్లో 11 మ్యాచ్‌లు ఆడిన సుయాశ్ 8.23 సగటున 10 వికెట్లు పడగొట్టాడు. -
జైస్వాల్ సెంచరీ చేయకుండా అడ్డుకున్న సుయాశ్.. ఏకి పారేసిన ఆకాశ్
కేకేఆర్‌తో నిన్న (మే 11) జరిగిన ఎలెక్ట్రిఫైయింగ్ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ 9 వికెట్ల తేడాతో భారీ విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో రాజస్థాన్ ఓపెనర్ యశస్వి జైస్వాల్ 47 బంతుల్లో 13 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో అజేయమైన 98 పరుగులు చేసి తన జట్టుకు బంతుల పరంగా (41) అతి పెద్ద విజయాన్ని అందించాడు. అయితే యశస్వి 2 పరుగుల తేడాతో సీజన్లో రెండో సెంచరీ చేసే అవకాశాన్ని కోల్పోవడం అందరినీ బాధించింది. ఈ విషయంపై భారత మాజీ క్రికెటర్, ప్రముఖ వ్యాఖ్యాత ఆకాశ్ చోప్రా ప్రత్యేకంగా స్పందించాడు. కేకేఆర్ బౌలర్ సుయాశ్ శర్మ ఉద్దేశపూర్వకంగా జైస్వాల్‌ను సెంచరీ చేయనీయకుండా అడ్డుకున్నాడని మండిపడ్డాడు. సుయాశ్ చర్యను తీవ్రంగా వ్యతిరేకించిన ఆకాశ్.. పాక్ బౌలర్, కోహ్లిని సెంచరీ చేయనీకుండా అడ్డుకుంటే పరిస్థితి ఎలా ఉండేదో ఊహించుకోండని అన్నాడు. సుయాశ్, సొంత దేశ ఆటగాడి విషయంలో ఇలా ప్రవర్తించడం నిజంగా సిగ్గుచేటు అన్న అర్ధం వచ్చేలా ట్వీట్ చేశాడు. సుయాశ్ చర్యను పూర్ టేస్ట్‌గా అభివర్ణించాడు. ఆకాశ్ తన ట్వీట్లో సుయాశ్ చర్యను సమర్ధించిన వారిని కూడా ఏకి పారేశాడు. కాగా, రాజస్థాన్ గెలుపుకు నాలుగు పరుగులు చేయాల్సిన తరుణంలో, జైస్వాల్ 94 పరుగుల స్కోర్ వద్ద ఉండగా సుయాశ్ ఉద్దేశపూర్వకంగా వైడ్ బాల్ వేసేందుకు ప్రయత్నించాడు. అప్పటికే అప్రమత్తంగా ఉన్న సంజూ శాంసన్ దాన్ని డిఫెండ్ చేసి జైస్వాల్‌కు స్ట్రయిక్ రొటేట్ చేశాడు. అయితే జైస్వాల్ విన్నింగ్ షాట్‌ను సిక్సర్‌గా మలచలేకపోవడంతో 98 పరుగుల వద్దే ఆగిపోయి, సెంచరీ చేసే అవకాశాన్ని కోల్పోయాడు. చదవండి: నాకే ఎందుకిలా? వెక్కి వెక్కి ఏడ్చా.. గుండు చేసుకున్నా: సూయశ్ శర్మ -
నాకే ఎందుకిలా? వెక్కి వెక్కి ఏడ్చా.. గుండు చేసుకున్నా: సూయశ్ శర్మ
IPL 2023- KKR Star Suyash Sharma: ‘‘గతేడాది నేను అండర్-19 ట్రయల్స్‌లో మెరుగైన ప్రదర్శన కనబరిచాను. కానీ సెలక్ట్ కాలేకపోయాను. ట్రయల్స్‌లో ఎంపికైన వాళ్ల జాబితాను మధ్యరాత్రి 12. 30- ఒంటి గంట మధ్య విడుదల చేశారు. కానీ అప్పటికే నేను నిద్రపోయాను. తెల్లవారి మూడు గంటలకు నిద్రలేచిన తర్వాత లిస్టు చూశాను. ఆ తర్వాత రెండు గంటల పాటు ఏకధాటిగా ఏడుస్తూనే ఉన్నాను’’ అంటూ కోల్‌కతా నైట్ రైడర్స్ యువ స్పిన్నర్ సూయశ్ శర్మ తనకు ఎదురైన చేదు అనుభవం గురించి పంచుకున్నాడు. రూ. 20 లక్షలతో న్యూఢిల్లీలో జన్మించిన.. పందొమిదేళ్ల సూయశ్ శర్మ దేశవాళీ క్రికెట్లో ఇంతవరకు అరంగేట్రం చేయలేదు. ఢిల్లీ అండర్-25 పురుషుల స్టేట్-ఏ ట్రోఫీ టోర్నీలో మాత్రమే ఆడాడు. ఈ ఈవెంట్లో మొత్తంగా 5 మ్యాచ్‌లు ఆడి కేవలం రెండు వికెట్లే పడగొట్టిన సూయశ్ ఐపీఎల్-2023 మినీ వేలంలో తన పేరు నమోదు చేసుకున్నాడు. అరంగేట్రంలోనే అదుర్స్ కనీస ధర రూ. 20 లక్షలకు అతడిని కొనుగోలు చేసిన కేకేఆర్ ఆర్సీబీతో మ్యాచ్‌లో ఇంపాక్ట్ ప్లేయర్‌గా అవకాశం ఇచ్చింది. ఈ మ్యాచ్‌లో నాలుగు ఓవర్ల కోటా పూర్తి చేసిన ఈ మణికట్టు స్పిన్నర్ 30 పరుగులు ఇచ్చి 3 వికెట్లు తీశాడు. వెంకటేశ్ అయ్యర్ స్థానంలో ఇంపాక్ట్ ప్లేయర్‌గా దింపినందుకు మేనేజ్మెంట్ నమ్మకాన్ని నిలబెట్టుకుని పైసా వసూల్ ప్రదర్శన ఇచ్చాడు. ఆర్సీబీపై విజయంలో తన వంత పాత్ర పోషించి క్రికెట్ ప్రేమికుల దృష్టిని ఆకర్షించాడు. గుండు చేసుకున్నా ఇక ఇప్పటి వరకు ఐపీఎల్-2023లో 9 మ్యాచ్‌లు ఆడిన సూయశ్ 10 వికెట్లు తీశాడు. ఇదిలా ఉంటే.. బ్లాక్ హెడ్‌బ్యాండ్‌తో కనిపించే యువ స్పిన్నర్ ఎంత ప్రయత్నించినా అండర్-19 ట్రయల్స్‌లో సెలక్ట్ కాలేకపోయానంటూ తాజా ఐపీఎల్ ఇంటర్వ్యూలో తన ఆవేదన పంచుకున్నాడు. ‘‘వాళ్లు నన్ను బౌలింగ్ చేయమని చెప్పారు. కానీ నేను అక్కడకు వెళ్లగానే నన్ను అసలు పట్టించుకోలేదు. సెలక్ట్ చేయలేదు. నేను ఏడుస్తూ ఇంటికొచ్చాను. వెంటనే నా తల మొత్తం షేవ్ చేసుకున్నా(గుండు చేసుకున్నా). ఎంతో ఆశగా వెళ్లిన నేను తీవ్ర నిరాశకు లోనయ్యాను. నాకే ఎందుకిలా? ఎంత ప్రయత్నించినా నాకే ఎందుకిలా జరుగుతోందనంటూ వెక్కి వెక్కి ఏడ్చాను’’ అని సూయశ్ శర్మ చెప్పుకొచ్చాడు. ఈ చేదు అనుభవం నుంచి త్వరగానే కోలుకున్నానన్న సూయశ్.. తన నైపుణ్యాలకు మరింత పదునుపెట్టానని.. ఏదో ఒకరోజు ఇంటి నుంచే తన సెలక్షన్ జరుగుతుందనే నమ్మకంతో ఉన్నానన్నాడు. ఐపీఎల్-2023 మినీ వేలం రూపంలో తన కల నెరవేరిందంటూ సంతోషం వ్యక్తం చేశాడు. ఇలా ఎన్నో అవమానాల తర్వాత తన కెరీర్లో ఆర్సీబీ వంటి పటిష్ట జట్టుతో తొలి ప్రొఫెషనల్ మ్యాచ్ ఆడిన సూయశ్.. తనదైన ముద్ర వేయగలిగాడు. ఇదిలా ఉంటే.. రాజస్తాన్ రాయల్స్‌తో గురువారం నాటి మ్యాచ్‌లో సూయశ్ 3 ఓవర్లలో 22 పరుగులు ఇచ్చి ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు. ఇక ఈ మ్యాచ్‌లో 9 వికెట్ల తేడాతో ఓడిపోయిన కేకేఆర్ పాయింట్ల పట్టికలో ఏడో స్థానానికి పడిపోయింది. చదవండి: షాపులో పనిచేసి.. కష్టాలకోర్చి.. ఇప్పుడు రికార్డులు సృష్టిస్తూ!; జై షా ట్వీట్ వైరల్ రనౌట్ విషయంలో సంజూ భాయ్ నాతో ఏమన్నాడంటే: యశస్వి జైశ్వాల్ 🗣Suyash Sharma: "I shaved my head after I wasn't picked for the U-19. The list came out at 12:30 AM and I woke up at 3:00 AM and got to know about it. I cried for the next two hours. Then I decided that I will improve my skills and one day they will pick me from my house." pic.twitter.com/vAdkWjsaJW — KnightRidersXtra (@KRxtra) May 11, 2023 Anuj Rawat ☑️ Dinesh Karthik ☑️ Watch Suyash Sharma pick two quick wickets in his debut game. Live - https://t.co/V0OS7tFZTB #TATAIPL #KKRvRCB #IPL2023 pic.twitter.com/3igG1jDWb4 — IndianPremierLeague (@IPL) April 6, 2023 -
'అతడొక అద్భుతం.. కచ్చితంగా టీమిండియాకు ఆడుతాడు'
ఐపీఎల్-2023లో భాగంగా చిన్నస్వామి స్టేడియం వేదికగా ఆర్సీబీతో జరిగిన మ్యాచ్‌లో కేకేఆర్ యువ స్పిన్నర్ సుయాష్ శర్మ అదరగొట్టాడు. ఇంపాక్ట్ ప్లేయర్‌గా బరిలోకి దిగిన సుయాష్ రెండు కీలక వికెట్లు పడగొట్టి.. కేకేఆర్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. తన నాలుగు ఓవర్ల కోటాలో 30 పరుగులిచ్చి రెండు వికెట్లు సాధించాడు. ఇక ఈ మ్యాచ్ అనంతరం19 ఏళ్ల సుయాష్ శర్మపై మరో కేకేఆర్ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి ప్రశంసల వర్షం కురిపించాడు. సుయాష్ భవిష్యత్తులో కచ్చితంగా భారత జట్టుకు ఆడుతాడని చక్రవర్తి కొనియాడాడు. కాగా ఈ మ్యాచ్‌లో చక్రవర్తి కూడా అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. వరుణ్ తన నాలుగు ఓవర్ల కోటాలో మూడు వికెట్లు పడగొట్టి 27 పరుగులిచ్చాడు. "సుయాష్ శర్మ అద్భుతమైన లెగ్ స్పిన్నర్. అతడు జట్టులోకి రావడంతో మా బౌలింగ్ విభాగం మరింత బలపడింది. అదే విధంగా అతడు భవిష్యత్తులో కచ్చితంగా భారత్ తరపున ఆడుతాడు. అతడు దేశీవాళీ క్రికెట్లో ఆడి తన టాలెంట్‌ను మరింత మెరుగుపరుచుకోవాలని" మ్యాచ్ అనంతరం ఏర్పాటు చేసిన విలేకురల సమావేశంలో వరుణ్ చక్రవర్తి పేర్కొన్నాడు. కాగా ఈ మ్యాచ్‌లో కేకేఆర్ 21 పరుగుల తేడాతో విజయం సాధించింది. చదవండి: IPL 2023 RCB Vs KKR: కోహ్లి కాలికి దండం పెట్టిన రింకూ సింగ్.. ఫోటోలు వైరల్ -
ఇంపాక్ట్ ప్లేయర్ల ఇంపాక్ట్ ఎంత.. ఏ జట్టు ఎక్కువ లాభపడింది..?
ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో ఇంపాక్ట్ ప్లేయర్ అనే ఆప్షన్ ప్రస్తుత ఎడిషన్ (2023) నుంచే మొదలైన విషయం తెలిసిందే. ఈ సరికొత్త నిబంధన ప్రకారం టాస్ సమయంలో ఇరు జట్ల కెప్టెన్లు ఐదుగురు సబ్‌స్టిట్యూట్ ప్లేయర్ల జాబితాను ప్రకటిస్తారు. వీరిలో ఒకరిని సంబంధిత జట్టు ఇంపాక్ట్ ప్లేయర్‌గా వినియోగించుకుంటుంది. ఇంపాక్ట్ ప్లేయర్‌ను ఇన్నింగ్స్ ప్రారంభానికి ముందు, వికెట్ పడిన తర్వాత, బ్యాటర్ రిటైర్ అయిన తర్వాత, ఓవర్ పూర్తయిన సందర్భాల్లో పరిచయం చేయవచ్చు. ప్రస్తుత సీజన్లో ఇప్పటిదాకా జరిగిన మ్యాచ్‌ల్లో అన్ని జట్లు ఈ అప్షన్‌ను విజయవంతంగా వినియోగించుకున్నాయి. లీగ్‌లో మున్ముందు అన్ని జట్లు ఈ ఆప్షన్‌ను ఇంకా బెటర్‌గా ఉపయోగించుకునే అవకాశం ఉంది. లీగ్‌లో ఇప్పటిదాకా జరిగిన మ్యాచ్‌ల్లో కేకేఆర్ ఇంపాక్ట్ ప్లేయర్ ఆప్షన్‌ను సక్సెసఫుల్గా వాడుకుందని చెప్పాలి. గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో బౌలర్ సుయాశ్ శర్మ స్థానంలో వెంకటేశ్ అయ్యర్‌ను ఇంపాక్ట్ ప్లేయర్‌గా బరిలోకి దించి, సక్సెస్ సాధించింది. ఆ మ్యాచ్‌లో అయ్యర్ 40 బంతుల్లో 83 పరుగులు చేసి తన జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. లీగ్‌లో ఇప్పటివరకు జరిగిన మ్యాచ్‌ల్లో వివిధ జట్లు వినియోగించుకున్న ఇంపాక్ట్ ప్లేయర్ల వివరాలు.. గుజరాత్ వర్సెస్ సీఎస్కే: అంబటి రాయుడు స్థానంలో తుషార్ దేశ్‌పాండే, కేన్ విలియమ్సన్ స్థానంలో సాయి సుదర్శన్ పంజాబ్ వర్సెస్ కేకేఆర్: వరుణ్ చక్రవర్తి స్థానంలో వెంకటేశ్ అయ్యర్, భానుక రాజపక్ష స్థానంలో రిషి ధవన్ లక్నో వర్సెస్ డీసీ: ఆయుష్ బదోని స్థానంలో కృష్ణప్ప గౌతమ్, ఖలీల్ అహ్మద్ స్థానంలో అమాన్ ఖాన్ సన్‌రైజర్స్ వర్సెస్ రాజస్థాన్: ఫజల్హక్ ఫారూఖీ స్థానంలో అబ్దుల్ సమద్, యశస్వి జైస్వాల్ స్థానంలో నవ్‌దీప్ సైనీ ఆర్సీబీ వర్సెస్ ముంబై: సూర్యకుమార్ యాదవ్ స్థానంలో బెహ్రెన్‌డార్ఫ్ సీఎస్కే వర్సెస్ లక్నో: ఆవేశ్ ఖాన్ స్థానంలో బదోని, రాయుడు స్థానంలో తుషార్ దేశ్‌పాండే ఢిల్లీ వర్సెస్ గుజరాత్: సర్ఫరాజ్ ఖాన్ స్థానంలో ఖలీల్‌అహ్మద్, జాషువ లిటిల్ ప్లేస్‌లో విజయ్ శంకర్ రాజస్థాన్ వర్సెస్ పంజాబ్: చహల్ ప్లేస్‌లో దృవ్ జురెల్, ప్రభ్‌సిమ్రన్ స్థానంలో రిషి ధవన్ కేకేఆర్ వర్సెస్ ఆర్సీబీ: వెంకటేశ్ అయ్యర్ స్థానంలో సుయాశ్ శర్మ, సిరాజ్ప్లేస్లో అనూజ్ రావత్ లక్నో వర్సెస్ సన్‌రైజర్స్: రాహుల్ త్రిపాఠి ప్లేస్‌లో ఫజల్హక్ ఫారూకీ, అమిత్ మిశ్రా స్థానంలో బదోని రాజస్థాన్ వర్సెస్ ఢిల్లీ: ఖలీల్ అహ్మద్ స్థానంలో పృథ్వీ షా, బట్లర్ ప్లేస్‌లో మురుగన్ అశ్విన్ ముంబై వర్సెస్ సీఎస్కే: టిమ్ డేవిడ్ స్థానంలో కుమార్ కార్తికేయ, దీప్ చాహర్ స్థానంలో రాయుడు గుజరాత్ వర్సెస్ కేకేఆర్: సాయి సుదర్శన్ స్థానంలో జాషువ లిటిల్, సుయాశ్ ప్లేస్‌లో వెంకటేశ్ అయ్యర్ సన్‌రైజర్స్ వర్సెస్ పంజాబ్: ప్రభ్‌సిమ్రన్ స్థానంలో సికందర్ రజా ఆర్సీబీ వర్సెస్ లక్నో: అమిత్ మిశ్రా స్థానంలో బదోని, అనూజ్‌రావత్ ప్లేస్‌లో కర్ణ్ శర్మ ఢిల్లీ వర్సెస్ ముంబై: పృథ్వీ షా స్థానంలో ముకేశ్ కుమార్ సీఎస్కే వర్సెస్ రాజస్థాన్: బట్లర్ స్థానంలో జంపా, మగాలా ప్లేస్‌లో రాయుడు -
KKR స్టేబుల్‌లో కొత్త మిస్టరీ స్పిన్నర్
-
నీరజ్‌చోప్రా తమ్ముడిలా ఉన్నాడు.. 'ఇంపాక్ట్'ను భలే వాడింది పో!
ఐపీఎల్ 16వ సీజన్లో భాగంగా గురువారం ఆర్సీబీతో జరిగిన మ్యాచ్‌లో కేకేఆర్ భారీ విజయాన్ని దక్కించుకున్న సంగతి తెలిసిందే. లార్డ్ శార్దూల్ ఠాకూర్ తొలి ఐపీఎల్ హాఫ్ సెంచరీతో ఆకట్టుకోగా.. అతనికి రింకూ సింగ్ చక్కగా సహకరించాడు. అయితే కేకేఆర్ విజయంతో పాటు మరొక ఆటగాడిని వెలుగులోకి తెచ్చింది. అతనే సుయాష్ శర్మ. ఈ సీజన్ నుంచే కొత్తగా ప్రవేశపెట్టిన ఇంపాక్ట్ ప్లేయర్‌ను ఏ జట్టు సరిగ్గా వాడుకోలేదన్న అపవాదును కేకేఆర్ తుడిచేసింది. సరైన సమయంలో ఇంపాక్ట్ ప్లేయర్‌ను బరిలోకి దింపింది. వెంకటేశ్ అయ్యర్ స్థానంలో స్పిన్నర్ సుయాశ్ శర్మ ఇంపాక్ట్ ప్లేయర్‌గా వచ్చాడు. వైవిధ్యమైన బౌలింగ్‌తో అందరిని ఆకట్టుకున్న సుయాష్ శర్మకు ఇదే తొలి ఐపీఎల్ కాగా.. ఆర్సీబీ మ్యాచ్ అతనికి డెబ్యూ కావడం విశేషం. అప్పటికే కేకేఆర్ టాప్ స్పిన్నర్లు వరుణ్ చక్రవర్తి, సునీల్ నరైన్‌లు ప్రభావం చూపిస్తుండడంతో నితీష్ రాణా ఇంపాక్ట్‌గా వచ్చిన మిస్టరీ స్పిన్నర్ సుయాష్ శర్మకు బౌలింగ్ ఇచ్చాడు. కెప్టెన్ నమ్మకాన్ని నిజం చేస్తూ సుయాష్ దినేశ్ కార్తిక్, అనూజ్ రావత్, కర్ణ్‌శర్మ వికెట్లను పడగొట్టాడు. ఓవరాల్‌గా 4 ఓవర్లు బౌలింగ్ చేసి 30 పరుగులిచ్చి మూడు వికెట్లు తీసుకొని ఆకట్టుకున్నాడు. అయితే సుయాష్ శర్మపై సోషల్ మీడియాలో ప్రశంసల వర్షం కురిసింది. తలకు హెయిర్బాండ్తో బరిలోకి దిగిన సుయాష్‌ను దూరం నుంచి చూస్తే జావెలిన్ స్టార్.. ఒలింపియన్ నీరజ్ చోప్రాల కనిపిస్తున్నాడంటూ పేర్కొన్నారు. సుయాష్ నీరజ్ చోప్రాకు దగ్గరి పోలికలు ఉన్నాయని.. బహుశా వాళ్లిద్దరు అన్నదమ్ముళ్లేమోనని ఎంక్వైరీ కూడా చేశారు. ఇక కొంతమంది మాత్రం ఈ సుయాష్.. నీరజ్ చోప్రాకు తమ్ముడిలా ఉన్నాడు.. ఏదైనా కేకేఆర్ ఇంపాక్ట్ ప్లేయర్‌ను కరెక్ట్ టైంలో వాడి ఫలితం సాధించింది. అంటూ కామెంట్లు చేశారు. అతని బౌలింగ్ శైలి కూడా నీరజ్ చోప్రా జావెలిన్ త్రో విసిరే సమయంలో ఇచ్చే యాక్షన్‌ను గుర్తుచేయడం మరో కారణం. ఏదైనా ఒక్క మ్యాచ్‌తోనే సుయాష్ శర్మ అందరి దృష్టిలో పడ్డాడు. ఇక 19 ఏళ్ల సుయాష్ శర్మ ఢిల్లీలో జన్మించాడు. ఇప్పటివరకు అతడు ఏ దేశవాళీ జట్టుకు ఎంపిక కాలేదు. అతడు ఇప్పటివరకు ఢిల్లీ అండర్-25 పురుషుల స్టేట్-ఎ ట్రోఫీలో మాత్రమే ఆడాడు. ఈ టోర్నీలో 5 మ్యాచ్‌లు ఆడిన సుయాష్ కేవలం 2వికెట్లు పడగొట్టాడు. కాగా కేకేఆర్‌తో ఆడిన మ్యాచే అతడికి తొలి ప్రొఫెషనల్ గేమ్ కావడం విశేషం. ఇక గతేడాది ఆఖరిలో జరిగిన ఐపీఎల్-2023 మినీవేలంతో సుయాష్ శర్మను రూ.20లక్షల కనీస ధరకు కేకేఆర్ కొనుగోలు చేసింది. Anuj Rawat ☑️ Dinesh Karthik ☑️ Watch Suyash Sharma pick two quick wickets in his debut game. Live - https://t.co/V0OS7tFZTB #TATAIPL #KKRvRCB #IPL2023 pic.twitter.com/3igG1jDWb4 — IndianPremierLeague (@IPL) April 6, 2023 KKR brings Neeraj chopra as Impact Player 😂#KKRvRCB pic.twitter.com/xuhsfaw9rr — Cricpedia (@_Cricpedia) April 6, 2023 No one has seen Neeraj Chopra and Suyash Sharma in the same room. pic.twitter.com/L5PLSmtvwV — KnightRidersXtra (@KRxtra) April 6, 2023 Suyash looks like a Zip version of Neeraj Chopra !! — Arnab Bhattacharyya (@TheBongGunner) April 6, 2023 చదవండి: KKR Vs RCB: ఆ షాట్ సెలక్షన్ ఏంటి? రాణా సంగా అవుదామనుకుని.. #Lord Shardul: ఆర్సీబీకి చుక్కలు.. తొలి ఫిఫ్టీతోనే రికార్డులు