PC: IPL Twitter
కేకేఆర్‌తో నిన్న (మే 11) జరిగిన ఎలెక్ట్రిఫైయింగ్ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ 9 వికెట్ల తేడాతో భారీ విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో రాజస్థాన్ ఓపెనర్ యశస్వి జైస్వాల్ 47 బంతుల్లో 13 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో అజేయమైన 98 పరుగులు చేసి తన జట్టుకు బంతుల పరంగా (41) అతి పెద్ద విజయాన్ని అందించాడు. అయితే యశస్వి 2 పరుగుల తేడాతో సీజన్‌లో రెండో సెంచరీ చేసే అవకాశాన్ని కోల్పోవడం అందరినీ బాధించింది.
ఈ విషయంపై భారత మాజీ క్రికెటర్, ప్రముఖ వ్యాఖ్యాత ఆకాశ్ చోప్రా ప్రత్యేకంగా స్పందించాడు. కేకేఆర్ బౌలర్ సుయాశ్ శర్మ ఉద్దేశపూర్వకంగా జైస్వాల్‌ను సెంచరీ చేయనీయకుండా అడ్డుకున్నాడని మండిపడ్డాడు. సుయాశ్ చర్యను తీవ్రంగా వ్యతిరేకించిన ఆకాశ్.. పాక్ బౌలర్, కోహ్లిని సెంచరీ చేయనీకుండా అడ్డుకుంటే పరిస్థితి ఎలా ఉండేదో ఊహించుకోండని అన్నాడు. సుయాశ్, సొంత దేశ ఆటగాడి విషయంలో ఇలా ప్రవర్తించడం నిజంగా సిగ్గుచేటు అన్న అర్ధం వచ్చేలా ట్వీట్ చేశాడు. సుయాశ్ చర్యను పూర్ టేస్ట్‌గా అభివర్ణించాడు. ఆకాశ్ తన ట్వీట్‌లో సుయాశ్ చర్యను సమర్ధించిన వారిని కూడా ఏకి పారేశాడు.
కాగా, రాజస్థాన్ గెలుపుకు నాలుగు పరుగులు చేయాల్సిన తరుణంలో, జైస్వాల్ 94 పరుగుల స్కోర్ వద్ద ఉండగా సుయాశ్ ఉద్దేశపూర్వకంగా వైడ్ బాల్ వేసేందుకు ప్రయత్నించాడు. అప్పటికే అప్రమత్తంగా ఉన్న సంజూ శాంసన్ దాన్ని డిఫెండ్ చేసి జైస్వాల్‌కు స్ట్రయిక్ రొటేట్ చేశాడు. అయితే జైస్వాల్ విన్నింగ్ షాట్‌ను సిక్సర్‌గా మలచలేకపోవడంతో 98 పరుగుల వద్దే ఆగిపోయి, సెంచరీ చేసే అవకాశాన్ని కోల్పోయాడు.
చదవండి: నాకే ఎందుకిలా? వెక్కి వెక్కి ఏడ్చా.. గుండు చేసుకున్నా: సూయశ్ శర్మ
Comments
Please login to add a commentAdd a comment