KKR's Suyash Sharma's similarity with Olympic Gold Medallist Neeraj Chopra leaves Internet stunned - Sakshi
Sakshi News home page

#Suyash Sharma: నీరజ్‌చోప్రా తమ్ముడిలా ఉన్నాడు.. 'ఇంపాక్ట్‌'ను భలే వాడింది పో!

Published Fri, Apr 7 2023 4:49 PM | Last Updated on Fri, Apr 7 2023 5:12 PM

KKR Suyash Sharma Looking Like Olympic Gold Medallist Neeraj Chopra - Sakshi

Photo: IPL Website

ఐపీఎల్‌ 16వ సీజన్‌లో భాగంగా గురువారం ఆర్‌సీబీతో జరిగిన మ్యాచ్‌లో కేకేఆర్‌ భారీ విజయాన్ని దక్కించుకున్న సంగతి తెలిసిందే. లార్డ్‌ శార్దూల్‌ ఠాకూర్‌ తొలి ఐపీఎల్‌ హాఫ్‌ సెంచరీతో ఆకట్టుకోగా.. అతనికి రింకూ సింగ్‌ చక్కగా సహకరించాడు. అయితే కేకేఆర్‌ విజయంతో పాటు మరొక ఆటగాడిని వెలుగులోకి తెచ్చింది.  అతనే సుయాష్‌ శర్మ.

ఈ సీజన్‌ నుంచే కొత్తగా ప్రవేశపెట్టిన ఇంపాక్ట్‌ ప్లేయర్‌ను ఏ జట్టు సరిగ్గా వాడుకోలేదన్న అపవాదును కేకేఆర్‌ తుడిచేసింది. సరైన సమయంలో ఇంపాక్ట్‌ ప్లేయర్‌ను బరిలోకి దింపింది. వెంకటేశ్‌ అయ్యర్‌ స్థానంలో స్పిన్నర్‌ సుయాశ్‌ శర్మ ఇంపాక్ట్‌ ప్లేయర్‌గా వచ్చాడు. వైవిధ్యమైన బౌలింగ్‌తో అందరిని ఆకట్టుకున్న సుయాష్‌ శర్మకు ఇదే తొలి ఐపీఎల్‌ కాగా.. ఆర్‌సీబీ మ్యాచ్‌ అతనికి డెబ్యూ కావడం విశేషం.

అప్పటికే కేకేఆర్‌ టాప్‌ స్పిన్నర్లు వరుణ్‌ చక్రవర్తి, సునీల్‌ నరైన్‌లు ప్రభావం చూపిస్తుండడంతో నితీష్‌ రాణా ఇంపాక్ట్‌గా వచ్చిన మిస్టరీ స్పిన్నర్‌ సుయాష్‌ శర్మకు బౌలింగ్‌ ఇచ్చాడు. కెప్టెన్‌ నమ్మకాన్ని నిజం చేస్తూ సుయాష్‌ దినేశ్‌ కార్తిక్‌, అనూజ్‌ రావత్‌, కర్ణ్‌శర్మ వికెట్లను పడగొట్టాడు. ఓవరాల్‌గా 4 ఓవర్లు బౌలింగ్‌ చేసి 30 పరుగులిచ్చి మూడు వికెట్లు తీసుకొని ఆకట్టుకున్నాడు.

అయితే సుయాష్‌ శర్మపై సోషల్‌ మీడియాలో ప్రశంసల వర్షం కురిసింది. తలకు హెయిర్‌బాండ్‌తో బరిలోకి దిగిన సుయాష్‌ను దూరం నుంచి చూస్తే జావెలిన్‌ స్టార్‌.. ఒలింపియన్‌ నీరజ్‌ చోప్రాల కనిపిస్తున్నాడంటూ పేర్కొన్నారు. సుయాష్‌ నీరజ్‌ చోప్రాకు దగ్గరి పోలికలు ఉన్నాయని.. బహుశా వాళ్లిద్దరు అన్నదమ్ముళ్లేమోనని ఎంక్వైరీ కూడా చేశారు. ఇక కొంతమంది మాత్రం ఈ సుయాష్‌.. నీరజ్‌ చోప్రాకు తమ్ముడిలా ఉన్నాడు.. ఏదైనా కేకేఆర్‌ ఇంపాక్ట్‌ ప్లేయర్‌ను కరెక్ట్‌ టైంలో వాడి ఫలితం సాధించింది. అంటూ కామెంట్లు చేశారు.  అతని బౌలింగ్‌ శైలి కూడా నీరజ్‌ చోప్రా జావెలిన్‌ త్రో విసిరే సమయంలో ఇచ్చే యాక్షన్‌ను గుర్తుచేయడం మరో కారణం. ఏదైనా ఒక్క మ్యాచ్‌తోనే సుయాష్‌ శర్మ అందరి దృష్టిలో పడ్డాడు. 

ఇక 19 ఏళ్ల సుయాష్ శర్మ ఢిల్లీలో జన్మించాడు. ఇప్పటివరకు అతడు ఏ దేశవాళీ జట్టుకు ఎంపిక కాలేదు. అతడు ఇప్పటివరకు ఢిల్లీ అండర్‌-25 పురుషుల స్టేట్-ఎ ట్రోఫీలో మాత్రమే ఆడాడు. ఈ టోర్నీలో 5 మ్యాచ్‌లు ఆడిన సుయాష్ కేవలం 2వికెట్లు పడగొట్టాడు. కాగా కేకేఆర్‌తో ఆడిన మ్యాచే అతడికి తొలి ప్రొఫెషనల్ గేమ్‌ కావడం విశేషం. ఇక గతేడాది ఆఖరిలో జరిగిన ఐపీఎల్‌-2023 మినీవేలంతో సుయాష్ శర్మను రూ.20లక్షల కనీస ధరకు కేకేఆర్‌ కొనుగోలు చేసింది.

చదవండి: KKR Vs RCB: ఆ షాట్‌ సెలక్షన్‌ ఏంటి? రాణా సంగా అవుదామనుకుని..

#Lord Shardul: ఆర్‌సీబీకి చుక్కలు.. తొలి ఫిఫ్టీతోనే రికార్డులు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement